Publish Date: Sat, 16 Aug 2008 (16:30 IST)
Updated Date: Sat, 16 Aug 2008 (16:29 IST)
కావలసిన పదార్థాలు :
బేకింగ్ పౌడర్... ఒక టీ స్పూన్
కొబ్బరి తురుము... అరకప్పు
జాజికాయ తురుము... అరకప్పు
బొంబాయి రవ్వ... 250 గ్రాములు
బెల్లం... 250 గ్రాములు
పాల మీగడ...ఒక కప్పు
గ్రుడ్లు... రెండు
వాల్‌నట్ కాయలు... 50 గ్రాములు
ఖర్జూరం... 50 గ్రాములు
తయారీ విధానం :
ఒక పాత్రలో బెల్లం వేసి మూడు కప్పుల నీటితో కరిగేంతవరకు మరిగించండి. దానిని దించి కాసేపు చల్లార్చి, అందులో పాల మీగడ, బేకింగ్ పౌడర్, జాజికాయపొడిని కలుపుకోండి. గిలకొట్టిన కోడి గ్రుడ్డు మిశ్రమంలో రవ్వను, బెల్లం మిశ్రమాన్ని కొంచెం, కొంచెంగా వేసుకుని కలుపుకోండి.
ఇందులో వాల్‌నట్, ఖర్జూరంలను కూడా కలపాలి. కేక్ టిన్ పాత్రల అంచులకు వెన్న పూసి... పైన తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో పోసి బాగా వేడిగా ఉండే ఓవెన్లో దాదాపు ఒక గంటసేపు ఉడికించండి. తరువాత కేక్ సర్వింగ్ డిష్‌లో అమర్చి పైన మీకు నచ్చే క్రీమ్‌తో అలంకరించుకోండి. అంతే రవ్వతో తయారైన కేక్ రెడీ అయినట్లే..!