Publish Date: Fri, 09 Jan 2009 (18:39 IST)
Updated Date: Fri, 09 Jan 2009 (18:38 IST)
కావలసిన పదార్థాలు :
యాపిల్స్... రెండు
కొబ్బరికాయ... ఒకటి
పంచదార... మూడు కప్పులు
జీడిపప్పు... తగినంత
నెయ్యి... రెండు టేబుల్ స్పూన్లు
యాలక్కాయలు... నాలుగు
తయారీ విధానం :
యాపిల్స్‌ను, కొబ్బరికాయను విడివిడిగా కోరి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార వేసి, కొద్దిగా నీటిని పోసి ఉండపాకం పట్టాలి. తరువాత అందులో యాపిల్, కొబ్బరి కోరులను వేసి బాగా పొంగువచ్చేదాకా కలపాలి.
వేరొక గిన్నెలో బాణలి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు, యాలక్కాయల పొడిని వేయించి పైన తయారు చేసిన యాపిల్ మిశ్రమంలో కలపాలి. ఒక వెడల్పాటి పళ్ళానికి నెయ్యి రాసి అందులో యాపిల్ మిశ్రమాన్ని పోసి నలుచదరంగా పరచాలి. అరగంట ఆరిన తరువాత కావాల్సిన షేప్‌లో ముక్కలను కోసి సర్వ్ చేయాలి. అంతే యాపిల్ కేక్ రెడీ అయినట్లే...!
వెరైటీగా ఉన్న యాపిల్ కేక్‌ను చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి మరి..!