కావలసిన పదార్థాలు :
అరటిపండ్ల గుజ్జు... పావుకేజీ
క్యాస్టర్ షుగర్ (చక్కెర పొడి)... పావు కేజీ
కోడిగుడ్డు... ఒకటి
బేకింగ్ సోడా... పది గ్రా.
పాలు... వంద గ్రా.
రీఫైన్డ్ ఆయిల్... వంద ఎం.ఎల్.
మైదా... పావుకేజీ
తయారీ విధానం :
అరటిపండ్ల గుజ్జు, క్యాస్టర్ షుగర్, కోడిగుడ్డు మిశ్రమం, బేకింగ్ సోడా, పాలు, రీఫైన్డ్ ఆయిల్, మైదాలను ఒక పాత్రలో వేసి బాగా మెత్తగా, మృదువుగా అయ్యేంతదాకా కలపాలి. బేకింగ్ టిన్‌లో ఈ మిశ్రమాన్ని పోసి మైక్రోవేవ్ ఓవెన్‌లో 150 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడివద్ద అరగంటపాటు బేక్ చేసి తీయాలి. ఓవెన్ లేనివారు కుక్కర్‌లో కూడా ఉడికించుకోవచ్చు. అంతే బనానా స్వీట్ బ్రెడ్ సిద్ధమైనట్లే...!!