కావలసిన పదార్థాలు :
మైదాపిండి... 2 కప్పులు
నెయ్యి... 2 టేబుల్ స్పూనులు
బేకింగ్ పౌడర్... 2 టీ స్పూనులు
బాగా పండిన అరటిపళ్ళు... మూడు
బెల్లం... సరిపడా
వాల్‌నట్ కాయలు... తొమ్మిది
నీరు... అర కప్పు
తయారీ విధానం :
మైదాపిండిలో బేకింగ్ పౌడర్‌ని కలిపి, బాగా జల్లించి పెట్టుకోవాలి. బెల్లం సన్నగా తరిగి, అలాగే అరటిపళ్ళను కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నెయ్యి వేసి, వేడి చేయాలి. దీనిలో తరిగిన బెల్లం వేసి నీటిని చేర్చాలి. సన్నని మంట మీద బెల్లం కరిగి, ద్రావణంలా తయారయ్యేంత వరకు కలుపుతూ వేడి చేయాలి.
తరువాత దించి చల్లార్చి, దీనిలో జల్లించిన మైదా పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. ఈ పిండిలో కోసి పెట్టుకొన్న అరటిపండు ముక్కలు, వాల్‌నట్ ముక్కలు వేసి బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. కేక్ తయారు చేసే పాత్రలో కొంచెం వెన్నపూసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి మధ్యరకం వేడి వున్న ఓవెన్‌లో 40 నుండి 50 నిమిషాల పాటు బేక్ చేయాలి.