Article Continental Food %e0%b0%a4%e0%b1%80%e0%b0%af%e0%b0%a8%e0%b0%bf %e0%b0%a6%e0%b1%8b%e0%b0%b6%e0%b1%86%e0%b0%b2%e0%b1%81 108032900012_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తీయని దోశెలు

Advertiesment
బ్రెడ్‌ ఎండ ఎండాక మిక్సీ పొడి బ్రెడ్ పొడి మైదా బొంబాయి రవ్వ వంటసోడా నీళ్ల మైదా
ఎప్పుడూ బ్రెడ్ స్లైసులు మిగిలి పోవడం సహజం కాబట్టి వాటిని వేస్ట్‌గా పారేయకుండా రుచికరంగా దోశెలు చేసుకోవచ్చు. వీటిని పిల్లలలు కూడా ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్థాలు :
బ్రెడ్ పొడి - కప్పు, చిక్కగా ఉండే మజ్జిగ - కప్పు, మైదా - అర కప్పు, బొంబాయి రవ్వ - అర కప్పు, క్యాప్సికమ్ ముక్కలు - పావు కప్పు(సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి ముక్కలు - పావు కప్పు, జీలకర్ర - చెంచా, వంటసోడా - చిటికెడు, నూనె - కాల్చడానికి సరిపడ, ఉప్పు - తగినంత.

తయారు చేయు విధానం :
ముందుగా బ్రెడ్‌లను ఎండలో పెట్టి బాగా ఎండాక మిక్సీలో వేసి పొడి తయారు చేసుకోవాలి. ఈ బ్రెడ్ పొడిలో మైదా, బొంబాయి రవ్వలను వేసి కలపాలి. తర్వాత వంటసోడాను నీళ్లలో కలిపి మైదా మిశ్రమంలో కలపాలి.

తర్వాత ఇందులో మజ్జిగను వేసి తగినంత ఉప్పు, జీలకర్రలను వేసి బాగా కలపాలి. క్యాప్సికం ముక్కలను వేసి అవి కనబడకుండా కలిపి పెట్టుకోవాలి. పెనం కాలేసి దానిపై నూనె వేసి పిండిని దోశెలుగా వేయాలి. పైన పచ్చిమిర్చి ముక్కలను వేసి రెండు వైపులా కాల్చి దించి నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి.

Share this Story:

Follow Webdunia telugu