Publish Date: Sat, 11 Aug 2007 (16:01 IST)
Updated Date: Sat, 11 Aug 2007 (16:01 IST)
Tom Kha Phak
కావలసిన పదార్థాలు:
పచ్చిమిర్చి: ఆరు లేక ఎనిమిది
లెమన్ గ్రాస్, అల్లం పేస్ట్: రెండు టీ స్పూన్లు
బీన్స్: పావు కేజీ
క్యారెట్: వంద గ్రాములు
నిమ్మకాయ: ఒకటి
అజినమోటో: చిటికెడు
కొబ్బరి పాలు: రెండు కప్పులు
ఉప్పు: తగినంత
తయారీ విధానం:
ఒక పాన్‌లో నీటిని పోసి కూరగాయ ముక్కలను వేసి ఉడికించండి. కాసేపయ్యాక పచ్చిమిర్చి తరుగులను అందులో కలుపుకోండి. మరిగిన నీటిని కాస్త పారబోసి అందులో నిమ్మకాయ రసాన్ని, కొబ్బరి పాలను కలిపి కాసేపుంచి దించేయండి. వీటిపై కొత్తిమీర తరుగుల్ని కూడా చేర్చితే రుచికరంగా ఉంటుంది.
గమనిక: ఈ డిష్‌కు థాయిలాండ్‌లో లెమన్ గ్రాస్, అనే పదార్థాన్ని ఉపయోగిస్తారు. అల్లం కూడా ప్రత్యేకమైన అల్లం ఇందులో వాడుతారు. లెమన్ గ్రాస్ వాడటమే ఈ డిష్ ప్రత్యేకత.