Publish Date: Fri, 18 Jul 2008 (18:10 IST)
Updated Date: Fri, 18 Jul 2008 (18:07 IST)
కావలసిన పదార్థాలు :
పెద్దసైజు టమోటోలు... ఎనిమిది
పంచదార... 5 టీస్పూన్లు
నిమ్మరసం... అర టీస్పూన్
పుదీనా రెబ్బలు... లేతవి ఆరు
తయారీ విధానం :
టమోటోలను కడిగి శుభ్రం చేసి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వీటిని పంచదారతో కలిపి మిక్సీలో వేసి అర నిమిషంపాటు హైస్పీడ్‌లో తిప్పాలి. నైలాన్ వల ఉన్న వడపోసే సాధనంతో నూరుకున్న టమోటో గుజ్జును వడగట్టాలి.
వడగట్టేటప్పుడు అందులో చల్లటి నీటిని పోస్తూ కలుపుతూ ఉంటే... జ్యూస్ విడిగా కిందికి కారుతుంది. పైన మిగిలిన గింజలు, తొక్క లాంటివి మిగిలిపోతాయి.
ఇప్పుడు వడగట్టిన టమోటో జ్యూస్‌కు ఆరు కప్పుల చల్లటినీటిని చేర్చి, పంచదార సరిపడేంత కలుపుతూ, ఉప్పు, నిమ్మరసాన్ని దానికి చేర్చాలి. జ్యూస్ పాత్రపై మూతపెట్టి, కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడిన తరువాత అతిథులకు అందించేటప్పుడు గ్లాసుల్లో పుదీనా రెబ్బలను వేసి సర్వ్ చేయండి.