Publish Date: Thu, 08 Jan 2009 (20:08 IST)
Updated Date: Thu, 08 Jan 2009 (19:52 IST)
కావలసిన పదార్థాలు :
కీరకాయ... ఒకటి
టమోటోలు.. రెండు
బ్లాక్ ఆలివ్స్... ఒక కప్పు
ఎర్ర ఉల్లిపాయ... ఒకటి
కొవ్వు లేని ఛీజ్... అర కప్పు
ఆలివ్ ఆయిల్... రెండు టీస్పూన్లు
నిమ్మరసం... రెండు టీస్పూన్లు
తయారీ విధానం :
కీరకాయ, టమోటోలు, బ్లాక్ ఆలివ్స్, ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఛీజ్‌ను కూడా సన్నగా తురిమి పై బౌల్‌లో వేసి కలపాలి.
తరువాత ఆలివ్ ఆయిల్, నిమ్మరసంను పై ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పదార్థాన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడ్డాక తింటే చాలా రుచిగా ఉంటుంది. పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి.