Publish Date: Thu, 08 Jan 2009 (20:09 IST)
Updated Date: Thu, 08 Jan 2009 (19:51 IST)
కావలసిన పదార్థాలు :
వెన్న... 30 గ్రాములు
పంచదార పొడి... 50 గ్రాములు
గుడ్డు... ఒకటి
పాలు... 15 మిల్లీలీటర్లు
మైదాపిండి... 50 గ్రాములు
బేకింగ్ పౌడర్... పావు టీస్పూన్
ఎండు ద్రాక్ష... 30గ్రాములు
వెనిల్లా ఎసెన్స్... కొన్ని చుక్కలు
తయారీ విధానం :
ఎండుద్రాక్ష తొడిమలు తీసి, నీళ్ళతో శుభ్రం చేయాలి. తర్వాత ఒక ఉతికిన, శుభ్రమైనబట్టతో వాటిని తడి లేకుండా తుడవాలి. మైదాను, బేకింగ్ పౌడర్‌ను జల్లించాలి. వెన్నను, పంచదార పొడిని బాగా క్రీమింగ్ చేయాలి. వెనిల్లా ఎసెన్స్‌తో కలిపి గిలకొట్టిన గుడ్డు సొనను ఈ క్రీంకు బాగా కలపాలి.
తర్వాత ఈ మిశ్రమానికి ఎండు ద్రాక్ష చేర్చాలి. మైదాను కూడా కలిపి, పిండి జారుగా ఉండేందుకు కాసిని పాలు కలపాలి. ఇప్పుడు పిండిని పేపర్ కప్స్‌లో పోసి 400 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో 25 నిమిషాల పాటు బేక్ చేయాలి. అంతే క్వీన్ కేక్స్ రెడీ అయినట్లే..!