Article Continental Food %e0%b0%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d %e0%b0%b8%e0%b1%82%e0%b0%aa%e0%b1%8d 108081300070_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆల్మండ్ సూప్

Advertiesment
వంటకాలు కాంటినెంటల్ క్యాబేజీ టమోటా క్యారెట్ ఉల్లిపాయ బీన్స్
FileND
కావలసిన పదార్ధాలు :
క్యాబేజీ ముక్కలు... అరకప్పు
టమోటా ముక్కలు... ఒక కప్పు
క్యారెట్ ముక్కలు... ఒక కప్పు
బంగాళా దుంప ముక్కలు... అరకప్పు
ఉల్లిపాయ ముక్కలు... అరకప్పు
బీన్స్... అరకప్పు
బాదం పప్పు... అరకప్పు
పాలు... ఒక కప్పు
మిరియాలపొడి... ఒక టీస్పూను
కార్న్‌ఫ్లోర్... 3 టేబుల్ స్పూన్స్
బాదం ఎసెన్స్... కొన్ని చుక్కలు
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
కూరగాయలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని వాటికి మూడున్నర కప్పుల నీటిని చేర్చి ఉడికించాలి. నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. బాదం పప్పును సన్నగా కట్ చేసుకుని పాలతో కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే బాదంపాలు తయారవుతాయి.

ఇప్పుడు బాదం పాలను, వడకట్టిన కూరగాయల నీటిని ఉప్పు, మిరియాల పొడితో కలిపి ఉడికించాలి. కార్న్‌ఫ్లోర్‌ను తగినన్ని నీళ్ళతో కలుపుకోవాలి. ఈ లిక్విడ్‌ను ఉడుకుతున్న సూప్‌లో కొద్దికొద్దిగా వేస్తూ మిశ్రమం చిక్కబడేంతవరకు కలపాలి. సర్వ్ చేసే ముందు తరిగిన బాదం పప్పు ముక్కల్ని, బాదం ఎసెన్స్‌ని పైన చల్లాలి. అంతే ఆల్మండ్ సూప్ రెడీ.

Share this Story:

Follow Webdunia telugu