Publish Date: Tue, 15 Jul 2008 (19:08 IST)
Updated Date: Tue, 15 Jul 2008 (19:08 IST)
కావలసిన పదార్థాలు :
యాపిల్స్... ఒక కేజీ
నిమ్మరసం... ఒక టీస్పూన్
పంచదార... ఒక కేజీ
ఉప్పు... 2 టీస్పూన్లు
తయారీ విధానం :
ముందుగా యాపిల్స్‌ను శుభ్రంగా కడిగి చెక్కు తీసి, విత్తనాలు లేకుండా ముక్కలుగా చేసుకోవాలి. నీటిలో ఉప్పు వేసి కరిగిన తరువాత ఆ నీటిని యాపిల్ ముక్కల మీద పోసి ఉంచాలి.
ఆ తరువాత పంచదారలో నిమ్మరసం కలిపి పొయ్యిమీద పెట్టి కరగనివ్వాలి. యాపిల్ ముక్కలను ఉప్పు నీటిలో నుంచి తీసి పిండి, పంచదార రసంలో వేసి ముక్కలు ఉడికేంతదాకా కలుపుతూ ఉండాలి. ముక్కలు ఉడికిన తరువాత, రసంతో సహా సీసాలో పోసి ఫ్రిజ్‌లో ఉంచుకుని అవసరమైనప్పుడు తీసి వాడుకోవచ్చు.