Publish Date: Thu, 08 Jan 2009 (19:50 IST)
Updated Date: Thu, 08 Jan 2009 (19:15 IST)
కావలసిన పదార్థాలు :
సోయా పన్నీర్... 100 గ్రా
పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర.... సరిపడా
కార్న్‌ఫ్లోర్... 10 గ్రా
ఉప్పు.... సరిపడా
రిఫైండ్ ఆయిల్... సరిపడా
తయారీ విధానం :
ముందుగా పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు మిశ్రమాన్ని రుబ్బుకోవాలి. సోయా పన్నీర్ సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఒక్కో పన్నీర్ స్లైస్ పైన అల్లం, పుదీనా మిశ్రమాన్ని పరిచి ఆపై పన్నీర్‌తో మూసివేసి దాన్ని కార్న్‌ఫ్లోర్‌ను కలుపగా వచ్చిన మిశ్రమంలో అద్ది నూనెలో దోరగా వేయించాలి. వేడిగా ఉన్నప్పుడే సోయా సాస్‌తో కలిపి అతిథులకు వడ్డించాలి.