Publish Date: Thu, 08 Jan 2009 (18:58 IST)
Updated Date: Thu, 08 Jan 2009 (18:57 IST)
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసులు... ఆరు
పనీర్... 150 గ్రాములు
క్యారెట్... ఒకటి
మిరియాల పొడి... అర టీస్పూన్
బట్టర్... 3 టీస్పూన్లు
తాజా క్రీం... 3 టీస్పూన్లు
గ్రీన్ క్యాప్సికం... ఒకటి
ఆలివ్ ఆయిల్... 4 టీస్పూన్లు
పుదీనా... తగినంత
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
పుదీనా ఆకులను ఎండలో ఆరబెట్టి, పొడిగా చేయాలి. క్యారెట్ తోలు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. క్యాప్సికంను కూడా అలాగే ముక్కలు చేయాలి. ఆలివ్ ఆయిల్‌ను వేడి చేసి కూరగాయల ముక్కలను అందులో వేసి తగినంతసేపు ఫ్రై చేయాలి.
ఉప్పు, మిరియాల పొడిని పై మిశ్రమానికి చేర్చాలి. ఇప్పుడు స్టవ్ మీద నుండి దించి పక్కన పెట్టుకోవాలి. పనీర్, క్రీమ్‌ను బాగా కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఈ మిశ్రమంలో కూరగాయల ముక్కలను కలపాలి. బ్రెడ్ ముక్కలను చక్రాల షేప్‌లో కట్ చేయాలి.
ఈ బ్రెడ్ ముక్కల అంచు, ఒకవైపు బట్టర్‌ను మరోవైపు పుదీనా ఆకుల పొడిని బ్రెడ్ ముక్కల అంచులకు బాగా రాయాలి. ఆ తరువాత పైన తయారు చేసి ఉంచిన పనీర్ మిశ్రమాన్ని బ్రెడ్ ముక్కలపై మందంగా రాసి అతిథులకు వడ్డించాలి. అంతే మింట్ వీల్స్ రెడీ అయినట్లే..!