Article Chinese Dishes %e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d %e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c%e0%b0%ae%e0%b0%b2%e0%b0%be%e0%b0%af%e0%b0%bf 109020300081_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రెడ్ రస్‌మలాయి

Advertiesment
వంటకాలు చైనీస్ బ్రెడ్ పీసులు పాలు కార్డమోమ్ పౌడర్ చక్కెర యాలక్కాయ పౌడర్ పిస్తా ముక్కలు పెనం టోస్ట్
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ పీసులు... నాలుగు
పాలు... ఒక లీటర్
కార్డమోమ్ పౌడర్... రెండు టీస్పూన్లు
చక్కెర... రుచికి సరిపడా
యాలక్కాయ పౌడర్... రెండు టీస్పూన్లు
సన్నగా తరిగిన పిస్తా ముక్కలు... నాలుగు టీస్పూన్లు

తయారీ విధానం :
ముందుగా పాలను బాగా మరిగించాలి. సగానికి పైగా పాలు చిక్కబడిన తరువాత చక్కెర, కార్డమోమ్ పౌడర్‌, యాలక్కాయ పౌడర్లను కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లబడిన తరువాత కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి బయటకు తీయాలి.

ఇప్పుడు... బ్రెడ్ ముక్కల చివర్లు తీసివేసి పెనంపై వేసి టోస్ట్‌లాగా వేయించాలి. పైన తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్‌లో పోసి, వేయించిన బ్రెడ్ టోస్టులను పైన సర్ది ఫ్రిజ్‌లో రెండు లేదా మూడు గంటలసేపు ఉంచాలి.

ఆ తరువాత ఫ్రిజ్‌లోంచి తీసి సన్నగా తరిగిన పిస్తా ముక్కలను పైన అలంకరించి సర్వ్ చేయాలి. అంతే బ్రెడ్ రస్‌మలాయి తయారైనట్లే...! ఇది బాగా చల్లగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu