Publish Date: Sat, 24 Jan 2009 (11:36 IST)
Updated Date: Sat, 24 Jan 2009 (11:35 IST)
కావలసిన పదార్థాలు :
కోడి... ఒకటి
టొమోటో సాస్... ఒక కప్పు
వెల్లుల్లి... 30 గ్రాములు
కారం... ఒకటిన్నర టీస్పూన్లు
కొత్తిమీర... రెండు కట్టలు
గరంమసాలా... రెండు గ్రాములు
నూనె... 50 గ్రాములు
ఉప్పు... తగినంత
మిరియాలపొడి... ఒక టీస్పూన్
వర్సెస్టర్ సాస్... నాలుగు టీస్పూన్లు
రెడ్ ఆరెంజ్ కలర్... చిటికెడు
స్టఫింగ్ కోసం...
ఉడికించిన కోడిగుడ్లు... రెండు
బ్రెడ్ ముక్కలు... 150 గ్రాములు
ఉప్పు... తగినంత
కోడిగుడ్లు... రెండు
ఉల్లిపాయలు... రెండు
తయారీ విధానం :
శుభ్రం చేసిన కోడిని తీసుకుని చాకుతో వెనక అంటే.. నడుం భాగంలో నిలువుగా కోసి లోపలి భాగాన్ని (పొట్టలోనివి) తీసివేయాలి. కాళ్లు, రెక్కలు అలాగే ఉంచాలి. తరువాత కోడికి బాగా ఉప్పు రాసి, కాసేపు పక్కన ఉంచాలి.
టొమోటో సాస్‌ను ఓ కప్పులో వేసి అందులో వెల్లుల్లి, కొత్తిమీర తరుగు, ఉప్పుతో పాటు గరంమసాలా, కారం, ఉప్పు, మిరియాల పొడి వర్సెస్టర్ సాస్, రెడ్ ఆరెంజ్ కలర్, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి.
ఇప్పుడు బ్రెడ్ ముక్కల పొడిలో పచ్చికోడిగుడ్ల సొన వేసి కలపాలి. తరువాత ముక్కలుగా కోసి ఉడికించిన గుడ్లు, ఉప్పు కలపాలి. దీనికి పైన కలుపుకున్న టమోటో సాస్ మిశ్రమాన్ని కూడా వేసి కలపాలి. చివరగా అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కలపాలి.
చివరగా... పైన కలుపుకున్న మిశ్రమాన్నంతటినీ కోడి పొట్టలో పెట్టి మందపాటి సూదీ దారంతో అంచుల్ని కలిపి కుట్టేయాలి. ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి, 180 డిగ్రీల సెంటీగ్రేడు హీట్ వద్ద 20 నిమిషాలపాటు బేక్ చేయాలి. అంతే డెర్బీ చికెన్ రెడీ అయినట్లే...!