Publish Date: Thu, 08 Jan 2009 (19:49 IST)
Updated Date: Thu, 08 Jan 2009 (19:16 IST)
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... 300 గ్రాములు
నూనె... 3 టీస్పూన్లు
ఉప్పు... తగినంత
కార్న్‌ఫ్లోర్... 50 గ్రాములు
స్టఫ్ చేసేందుకు ఉల్లిపాయలు... ఒకటి
క్యాబేజీ... 100 గ్రాములు
క్యారెట్... 100 గ్రాములు
బీన్స్... 100 గ్రాములు
నూనె... 4 టీస్పూన్లు
సోయాసాస్... 3 టీస్పూన్లు
చిల్లీసాస్... 3 టీస్పూన్లు
మిరియాలపొడి... పావు టీస్పూన్
ఉప్పు... తగినంత
అజినమోటో... చిటికెడు
తయారీ విధానం :
మైదా, కార్న్‌ఫ్లోర్ కలపాలి. అందులో ఉప్పు, నూనె వేసి కలపాలి. తరువాత సరిపడా నీళ్లు కలిపి గట్టిముద్దలా చేయాలి. దీనిమీద తడిబట్ట కప్పి 15 నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. పిండిని చిన్నసైజు నిమ్మకాయంత ఉండలుగా తీసుకుని గుండ్రంగా చేయాలి. అప్పడాలకర్రతో పలుచని పూరీల్లాగా వత్తుకుని, కర్రతో అంచుగ దగ్గర కాస్త పలుచగా ఒత్తితే మడతలు పెట్టేందుకు వీలుగా ఉంటుంది.
స్టఫింగ్ చేసే విధానం... కూరలన్నింటినీ సన్నగా తరగాలి. ప్రెషర్‌పాన్‌లో నూనె వేసి కాగాక, కూరలన్నీ వేసి సన్నటి మంటమీద గరిటెతో కలుపుతూ ఐదునిమిషాలపాటు వేయించాలి. తరువాత చిల్లీసాస్, మిరియాలపొడి, ఉప్పు, అజినొమోటో వేసి కలుపుతూ వేయించాలి. ముక్కలన్నీ వేగిన తరువాత దించాలి.
ఇలా తయారు చేసుకున్న కూరను వత్తుకుని ఉంచిన పూరీలలో పెట్టి అంచుల్ని అందంగా చీర కుచ్చిళ్ళలాగా మడవాలి. ఈ సమోసాలను ఇడ్లీ కుక్కర్ ఆవిరిమీద ఉడికించాలి. చైనా వాళ్లయితే ఆవిరిపాత్రలో వెదురుబుట్ట పెట్టి అందులో ఈ సమోసాలు ఉంచి పదినిమిషాలపాటు ఉడికిస్తారు.