Publish Date: Thu, 08 Jan 2009 (19:52 IST)
Updated Date: Thu, 08 Jan 2009 (19:12 IST)
కావలసిన పదార్థాలు:
పులావ్ రైస్... 500 గ్రాములు
ఉల్లిపాయలు... నాలుగు
ఏలక్కాయలు... మూడు
బటర్... 200 గ్రాములు
ఉప్పు... తగినంత
ఉల్లిపాయ తరుగు... సరిపడా
కొత్తిమీర తరుగు... సరిపడా
తయారీ విధానం :
వేడయిన ప్యాన్‌లో వెన్నను వేడిచేసి అందులోనే ఏలక్కాయలు, తరిగిన ఉల్లి ముక్కలను వేసి వేయించాలి. ఇందులో పులావ్ బియ్యాన్ని వేసి కలపాలి. బియ్యం బాగా వేగాక అందులో తగినంత ఉప్పు వేసి కలిపి నాలుగు గ్లాసుల నీటితో ఉడికించాలి. ఈ బియ్యం ఉడికాక అందులో ఉల్లిపాయ తరుగులు, కొత్తిమీర తరుగుల్ని వేసి అలంకరించి సర్వ్ చేయాలి. ఈ రైస్‌కు టమోటాసాస్‌ను సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు. ఈ రైస్‌లో కావాలనుకున్నవారు ఉడికించిన వెజిటబుల్స్‌ను కూడా వేసుకోవచ్చు.