Publish Date: Sat, 04 Aug 2007 (14:44 IST)
Updated Date: Sat, 04 Aug 2007 (14:44 IST)
కావలసిన పదార్థాలు:
పులావ్ రైస్: 500 గ్రాములు
ఉల్లిపాయలు: నాలుగు
ఏలక్కాయలు: మూడు
బటర్: 200 గ్రాములు
ఉప్పు: తగినంత
ఇలా చేయండి:
వేడయిన ప్యాన్‌లో నూనెను పోసి ఏలక్కాయలు, తరిగిన ఉల్లి ముక్కలను వేసి వేయించండి. ఇందులో పులావ్ బియ్యాన్ని వేసి కలపండి. బియ్యం బాగా వేగాక అందులో తగినంత ఉప్పు వేసి కలిపి నాలుగు గ్లాసుల నీటితో ఉడికించండి. ఈ బియ్యం ఉడికాక అందులో ఉల్లిపాయ తరుగులు, కొత్తిమీర తరుగుల్ని వేసి అలంకరించి సర్వ్ చేయండి. ఈ రైస్‌కు టమోటాసాస్‌ను సైడిష్‌గా వాడుకోవచ్చు. ఈ రైస్‌లోఉడికించిన వెజిటబుల్స్‌ను కూడా వేస్తే రుచికరంగా ఉంటుంది.