కావలసిన పదార్థాలు
కారట్ తరుగు.. అరకప్పు
బీన్స్ తరుగు.. అర కప్పు
ఉల్లికాడల తరుగు.. ఒక కప్పు
రైస్.. రెండు కప్పులు
వెనిగర్.. నాలుగు టీ స్పూన్స్
అజ్నమెంటో.. ఒక టీ స్పూన్
సోయాసిస్.. రెండు స్పూన్స్
ఉప్పు .. సరిపడ
ఎలా తయారు చేస్తారు
ముందుగా బియ్యాన్ని కడిగి కొద్దిగా నూనె వేసి, దానికి నీళ్లు పోసి ఉడికించాలి. బాండీల్లో తరిగి పెట్టుకున్న కూరగాయల తరుగును ఉడికించి పెట్టుకోవాలి. వీటికి అజ్నమెంటో, సోయాసిస్, ఉప్పు, వెనిగర్ తదితరాలు కలుపుకుని రైస్‌లో కొద్ది సేపు ఉంచి, తర్వాత సర్వ్ చేసుకోవాచ్చు. దీనికి పెరుగు చట్నీ లేదా మసాలా సైడ్ డిష్‌గా వాడుకోవచ్చు.