Publish Date: Wed, 19 Mar 2008 (13:08 IST)
Updated Date: Wed, 19 Mar 2008 (13:08 IST)
కావలసిన పదార్థాలు :
కోడిమాంసం - ఎనిమిది పీస్‌లు, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - టీ స్పూన్, వెల్లుల్లి - టీ స్పూన్, చిల్లీ పేస్ట్ - టీ స్పూన్, కోడి గుడ్డు - ఒకటి, స్ప్రింగ్ ఆనియన్ - ఒకటి, కార్న్ ఫ్లోర్ - రెండు టీ స్పూన్లు, మిరియాలు - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - తగినంత, అజినమోటొ - చిటికెడు, మైదా - టేబుల్ స్పూన్.
తయారు చేయు విధానం :
ముందుగా ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్‌లను తరిగి పెట్టుకోవాలి. ఓ పాత్రలో చికెన్ వేసి అందులో అల్లం, వెల్లుల్లి, చిల్లీ పేస్ట్‌లను వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులో మైదా, ఉల్లి ముక్కలు, మిరియాలు, ఉప్పు, అజినమోటొలను వేసి కలపాలి.
కాసేపయ్యాక కార్న్‌ఫ్లోర్, కోడి గుడ్డును పగుల గొట్టి ఇందులో వేయాలి. బాణాలిలో నూనె వేసి కాగాక, ఇందులో చికెన్ ముక్కలను పకోడీల్లాగా వేసి వేయించి తీయాలి.