Publish Date: Wed, 09 Apr 2008 (13:01 IST)
Updated Date: Wed, 09 Apr 2008 (13:00 IST)
కావలసిన పదార్థాలు :
క్యాబేజీ - 150 గ్రాములు, క్యారెట్ - 100 గ్రాములు, ఉల్లిపాయలు - రెండు, క్యాప్సికమ్ - ఒకటి, పచ్చిమిర్చి సాస్ - రెండు టీస్పూన్లు, సోయాసాస్ - టీస్పూన్, టమోటా సాస్ - అరటీస్పూన్, తీపి లేని రస్కు పొడి - టేబుల్ స్పూన్, కార్న్‌ఫ్లోర్ - టేబుల్‌స్పూన్, ఇన్‌స్టంట్ వెజ్ పౌడర్ - రెండు టేబుల్ స్పూన్లు, శెనగపిండి - రెండు టేబుల్ స్పూన్లు, మైదాపిండి - రెండు టేబుల్ స్పూన్లు, నూనె- అర లీటరు, ఉప్పు - తగినంత.
తయారు చేయు విధానం :
ముందుగా క్యాబేజీ, క్యారెట్లను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోండి. ఉల్లిపాయ, క్యాప్సికమ్‌లను తరిగి పెట్టుకోండి. వీటిని ఫ్రిజ్‌లో మూత పెట్టకుండా ఓ పాత్రలో అరగంట సేపు ఉంచండి. తర్వాత వీటిని తీసి సోయా సాస్, మిర్చి సాస్, ఉప్పులను కలిపి వేజ్ పౌడర్‌ను కలిపి మరో పావుగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి.
తర్వాత దీనిని తీసుకుని ఇందులో రస్కు పొడి, పిండులను వేసి కలిపి పకోడా పిండిలా కలుపుకోవాలి. బాణాలిలో నూనె వేసి కాగాక, అందులో ఈ పిండిని పకోడాల్లాగా వేసి బంగారు వన్నె వచ్చేంత వరకు వేయించి దించి సర్వ్ చేయండి.