Article Chinese Dishes %e0%b0%9a%e0%b1%88%e0%b0%a8%e0%b0%be %e0%b0%ab%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d %e0%b0%ab%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88 108031900016_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనా ఫిష్ ఫ్రై

Advertiesment
నచ్చిన చేప - ఒకటి (పెద్దది)
కావలసిన పదార్థాలు :
నచ్చిన చేప - ఒకటి (పెద్దది), బియ్యపు పిండి - రెండు టీస్పూన్లు, వెనిగర్ - అర టీస్పూన్, పచ్చిమిర్చి సాస్ - 100 మిల్లీ గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, నూనె - అర లీటర్, ఉప్పు - తగినంత.

తయారు చేయు విధానం :
ముందుగా చేపను శుభ్రం చేసి రెండు ముక్కలుగా చేసుకోవాలి. బియ్యపు పిండిలో వెనిగర్ వేసి చేప ముక్కలపై రాసి పది నిముషాల పాటు ఉండనివ్వాలి. బాణాలిలో నూనె వేసి ఉల్లిముక్కలను వేసి దోరగా వేయించాలి. దీనిలో పచ్చిమిర్చి సాస్ వేసి కాస్త ఉప్పు వేయాలి.

మరో బాణాలిలో నూనె వేసి కాగాక అందులో చేప ముక్కలను వేసి అటు ఇటు తిప్పి వేయించాలి. కాసేపు ఉడికించి తీసి విడిగా పెట్టుకోవాలి. చేపపై రాసేందుకు ముందుగానే తయారు చేసిన సాస్‌ను దీనిపై వేసి రైస్‌తో వేడివేడిగా సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu