Publish Date: Thu, 08 Jan 2009 (20:12 IST)
Updated Date: Thu, 08 Jan 2009 (18:59 IST)
కావలసిన పదార్థాలు :
చికెన్... ముప్పావుకేజీ
కొత్తిమీర... తగినంత
కారంపొడి... తగినంత
పసుపు... సరిపడా
మినప్పప్పు... 150 గ్రాములు
అల్లంవెల్లుల్లి ముద్ద... 75 గ్రాములు
వంటసోడా... తగినంత
ఉప్పు... సరిపడా
రీఫైండ్ ఆయిల్... పావుకేజీ
మసాలా పొడి... రెండు టీస్పూన్లు
తయారీ విధానం :
ముందుగా మినప్పప్పును నీటిలో నానబెట్టుకోవాలి. చికెన్ తీసుకుని సన్నటి ముక్కలుగా తరిగి, వాటికి ఉప్పు, కారం, పసుపు, మసాలాపొడి పట్టించి రెండు గంటలసేపు అలాగే ఉంచేయాలి.
తరువాత పొయ్యిమీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి, నూనె పోసి కాగిన తరువాత చికెన్ ముక్కల్ని వేసి వేయించాలి. ఇవి వేగుతుండగానే అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. దీనిని కిందకు దించేసి. మరోవైపు నానబెట్టిన మినప్పప్పును కడిగి, నీరు పారబోసి వేయించి, మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడుకుతుండగానే కాస్తంత వంటసోడా వేసి ఉడికించాలి.
పప్పు మెత్తగా ఉడికిన తరువాత పైన వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ఫ్రైను తీసి ఇందులో వేసి బాగా కలియబెట్టాలి. చివరగా పైన కొత్తిమీర తరుగులు చల్లి అతిథులకు వడ్డించండి.