Publish Date: Thu, 08 Jan 2009 (19:52 IST)
Updated Date: Thu, 08 Jan 2009 (19:09 IST)
కావలసిన పదార్థాలు :
చికెన్... ఒక కిలో
అల్లంముద్ద... ఒక టీస్పూను
వెల్లుల్లి ముద్ద... ఒక టీస్పూను
అజినమోటో... చిటికెడు
వెనిగర్... ఒక టీస్పూను
సోయాసాస్... ఒక టీస్పూను
చిల్లీసాస్... ఒక టీస్పూను
చిన్న ఉల్లిపాయలు... పది
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
చికెన్‌ను శుభ్రం చేసుకుని కావాల్సిన సైజులో ముక్కలు చేసుకోవాలి. చికెన్‌కి పైన పదునయిన కత్తితో గాట్లు పెట్టుకోవాలి. ఉల్లిపాయలు తప్ప మిగిలినవన్నీ చికెన్ ముక్కలలో వేసి కలిపి డీప్ ప్రీజర్‌లో 12 గంటలపాటు ఊరనివ్వాలి. వండేందుకు రెండు గంటల ముందుగా చికెన్‌ను డీప్ ఫ్రీజర్‌లోంచి బయటకు తీసి మామూలు గది వాతావరణంలో ఉంచాలి.
తరువాత ఉల్లిపాయలు ఊడిపోకుండా ఎక్స్ ఆకారంలో అడుగునుండి లోతుగా గాట్లు పెట్టాలి. చికెన్ ముక్కలలో ఉల్లిపాయలను కలిపి బేకింగ్ ట్రేలో పెట్టి ఓవెన్‌లో 175 డిగ్రీల వేడితో అరగంటపాటు ఉడికించాలి. తరువాత తీసి కొత్తిమీర ఆకులను చల్లి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. బరువు పెరగకూడదనుకునేవారికి ఈ పదార్థం ఎంతో ఉపయోగంగా ఉంటుంది.