Article Chinese Dishes %e0%b0%9a%e0%b0%bf%e0%b0%95%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d %e0%b0%95%e0%b1%80%e0%b0%ae%e0%b0%be %e0%b0%ae%e0%b1%8b%e0%b0%ae%e0%b1%8b%e0%b0%b8%e0%b1%8d 108111400065_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చికెన్ కీమా మోమోస్

Advertiesment
వంటకాలు చైనీస్ చికెన్ కీమా అల్లం వెల్లుల్లి తరుగు ఉల్లిగడ్డల పేస్ట్ మిరియాల పొడి మైదాపిండి బియ్యంపిండి నూనె ఉప్పు చైనీస్
కావలసిన పదార్థాలు :
చికెన్ కీమా... రెండు కప్పు
అల్లం, వెల్లుల్లి తరుగు.... రెండు టీస్పూన్
ఉల్లిగడ్డ పేస్ట్... నాలుగు టీస్పూన్లు
మిరియాల పొడి... ఒక టీస్పూన్
మైదాపిండి... ఒక కప్పు
బియ్యంపిండి... ఒక కప్పు
నూనె... తగినంత
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
చైనీస్ వారికి ఎంతో ఇష్టమైన వంటకాన్ని తయారు చేయాలంటే... ముందుగా మైదా పిండి, బియ్యంపిండి మిశ్రమానికి తగినంత నీటిని కలిపి ముద్ద చేసి పక్కనుంచుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి తరుగు, ఉప్పు, మిరియాల పొడి కలిపి వేయించి, చివర్లో చికెన్ కీమాను కూడా కలిపి బాగా వేయించి, స్టౌమీద నుండి దించేయాలి.

మైదాపిండి ముద్దలో ఒక చిన్న బాల్ తీసుకుని పలుచగా రోటీలాగా చేసుకోవాలి. రోటీ మధ్యలో తగినంత చికెన్ కీమా మిశ్రమాన్ని ఉంచి కజ్జికాయల్లాగా చివరలు మూసేసి వత్తుకోవాలి. అలా మొత్తం పిండిని, కీమా మిశ్రమాన్ని కజ్జికాయల్లాగా చేసుకున్న తరువాత వాటిని ఆవిరిమీద ఎనిమిది నిమిషాలపాటు ఉడికించి తీసేయాలి.

అంతే చికెన్ కీమా మోమోస్ సిద్ధమైనట్లే...! వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే సాస్, వెజిటబుల్ చట్నీలతో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. చైనీస్ వారు అమితంగా ఇష్టపడే వంటకాన్ని మీరు కూడా తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు కదూ...!

Share this Story:

Follow Webdunia telugu