Publish Date: Wed, 09 Apr 2008 (12:59 IST)
Updated Date: Wed, 09 Apr 2008 (12:58 IST)
కావలసిన పదార్థాలు :
కాస్త ముదురుగా ఉన్న జొన్న గింజలు - మూడు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - ఐదు, జీలకర్ర - చెంచా, నూనె - వేయించడానికి సరిపడ, ఉప్పు - తగినంత.
తయారు చేయు విధానం :
ముందుగా మొక్కజొన్న గింజలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా నూరండి. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, జీలకర్ర, ఉప్పులను వేసి కలిపి ఓ తిప్పు తిప్పండి. బాణాలిలో నూనె వేసి కాగాక, ఈ పిండిని పకోడీలుగా వేయండి. అటు ఇటు తిప్పుతూ బంగారు వన్నె వచ్చేంతవరకు వేయించండి.
వీటిని పుదీనా చట్నీతో సర్వ్ చేయండి. మొక్కజొన్నతో చేసినవి కాబట్టి శరీరానికి కావలసిన విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.