Publish Date: Wed, 18 Jun 2008 (15:04 IST)
Updated Date: Wed, 18 Jun 2008 (15:04 IST)
కావలసిన పదార్థాలు :
చైనాగ్రాస్- నాలుగు టేబుల్ స్పూన్లు
పాలు- మూడు కప్పులు
పంచదార- నాలుగు టేబుల్ స్పూన్లు
క్రీమ్- నాలుగు టేబుల్ స్పూన్లు
ఊరిన చెర్రీస్, పైనాపిల్ ముక్కలు- చెరో 2 కప్పులు
నీళ్ళు- రెండు కప్పులు
బాదం ఎసెన్స్- అర టీస్పూన్
తయారీ విధానం :
ముందుగా పావుకప్పు నీటిని తీసుకుని అందులో చైనాగ్రాస్‌ను నానబెట్టి సన్నని సెగమీద ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పాలు, పంచదార వేసి కరిగిన పిమ్మట స్టవ్‌మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమానికి బాదంపప్పు, క్రీము కలిపి అంగుళం అంచుతో ఉన్న ప్లేటులో పోసి ఫ్రిజ్‌లో 15 నిమిషాల పాటు ఉంచాలి.
ఇంతలోపు రెండు కప్పుల నీటిలో అరకప్పు పంచదార వేసి కరిగించి ఈ మిశ్రమాన్ని కూడా ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరచుకోవాలి. చైనాగ్రాస్‌ను స్క్వేర్ షేప్‌లో ముక్కలుగా కట్‌చేసి వాటిమీద చల్లార్చిన సిరప్, ఎసెన్స్‌ను పోయాలి. ఈ సిరప్‌పై పైనాపిల్ ముక్కలు పెట్టి వాటిమధ్య రంధ్రంలో చెర్రీ ముక్కలు పెట్టి మీకు నచ్చిన విధంగా అలంకరించి సర్ చేసుకోవచ్చు.