Publish Date: Fri, 30 Nov 2018 (20:09 IST)
Updated Date: Fri, 30 Nov 2018 (20:11 IST)
శరీరంపైన మలినాలను తొలగించేది జల స్నానం అయితే, శరీరం లోపలి మలినాలను కడిగి జీవక్రియలకు తోడ్పడేది జలపానం. ఈ పంచభూతములలో గాలి తర్వాత స్థానం నీటిదే. ఆ తరువాతి స్థానం ఆహారానిది.
మన శరీరంలో అన్నిటికంటే నీరే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంది. చివరికి మనం నివశించే భూభాగంలోనూ మూడింతలు నీరే ఉంది. అలాగే మన శరీరంలో కూడా దాదాపు 68 శాతం నీరు ఆక్రమించి వుంటే, కేవలం 32 శాతం మాత్రమే ఇతరాలు ఆక్రమించి ఉన్నాయి.
కానీ ప్రస్తుత కాలంలో ఖరీదైన జీవితానికి అలవాటుపడిన మనిషికి నీటి ఆవశ్యకత తెలియక రోగాల పాలవుతున్నారు. నీటికి బదులు కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, లస్సీలు తాగి లేనిపోని రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. సాధారణంగా ఒక వంతు పదార్ధానికి మూడువంతుల నీటిని పుచ్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఎప్పుడు, ఎలా పుచ్చుకోవాలంటే...?
* పెద్దలు కనీసం ఐదు లీటర్ల నుంచి 6 లీటర్ల వరకు పుచ్చుకుంటే శరీరం సమతుల్యంగా ఉంటుంది.
* పిల్లల విషయానికొస్తే వారు 1 కేజీ నుండి 2 కేజీల వరకు ఆహారాన్ని పుచ్చుకుంటారు, కాబట్టి వారు రోజుకు 3 నుండి 4 లీటర్ల వరకు నీటిని పుచ్చుకోవాలి.
* ఉదయం నిద్రలేచిన వెంటనే లీటరు నుండి లీటరున్నర వరకు ఆహారాన్ని పుచ్చుకోవాలి.
* నీళ్ళు తాగిన తర్వాత 20 నిమిషాల వరకు ఏ పదార్థమూ పుచ్చుకోకూడదు.
* ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా నీటి పరిమాణం ఉండే పదార్ధాలను అంటే ఆకుకూర, పండ్లలో కూడా 70 నుంచి 80 శాతం వరకు నీరు ఉంటుంది కనుక వాటిని ఎక్కువగా పుచ్చుకోవాలి.
webdunia
Publish Date: Fri, 30 Nov 2018 (20:09 IST)
Updated Date: Fri, 30 Nov 2018 (20:11 IST)