Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంచెకట్టు మారింది.. స్టాలిన్ డ్రెస్ కోడ్ ఛేంజ్.. ప్యాంటు చొక్కాతో కొత్త లుక్!

Advertiesment
Why a Dhoti Doesn't Fit in Stalin's Mission Makeover
తమిళ రాజకీయ నేతలంటే పంచె, చొక్కా గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో ఎన్ని మార్పులొచ్చినా తమిళ పంచె కట్టులో ఎలాంటి మార్పుండదు. తమిళ రాజకీయాలను శాసించిన ఎంజీఆర్‌, నల్ల ఎంజీఆర్‌గా పేరొందిన విజయకాంత్ సినిమాల్లో ఎలా కనిపించినా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పంచె కట్టుతోనే కనిపించారు. కానీ ప్రస్తుతం డీంఎంకే డ్రెస్ కోడ్ మారింది. 
 
డీఎంకే సీనియర్‌ నేత, దివంగత మురసోలి మారన్ అధికంగా పంచె కట్టినా, అప్పుడప్పుడూ సూటుబూటులో కనిపించేవారు. మురసొలి చిన్నకుమారుడు దయానిధిమారన్ మాత్రం ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎప్పుడూ ప్యాంటూ చొక్కాతోనే కనిపిస్తారు. ఆయన మినహా నేతలంతా తమిళనాడులో తెల్ల పంచె, చొక్కాలోనే కనిపిస్తుంటారు. అయితే ఇటీవల డ్రెస్ కోడ్ మారింది.
 
డీఎంకే అధినేత కరుణ రాజకీయ వారసుడు, చిన్నకుమారుడు ఎంకే స్టాలిన్ ఇటీవల ప్యాంటు చొక్కాతోనే కనిపిస్తున్నారు. అన్బుమణి,  తిరుమావళవన్, కృష్ణస్వామిలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. వీరి రూటులోనే కార్యకర్తలు కూడా పంచెకట్టును పక్కనబెట్టి ప్యాంట్ చొక్కాలతో కనిపించాలని డిసైడ్ చేసుకుంటున్నారట. అదే కనుక జరిగితే డీఎంకే మొత్తం ప్యాంటు చొక్కాల మయం అవుతుందని.. తెల్లని పంచెకట్టు మాయమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu