Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుక్కను మేడపై నుంచి విసిరేశాడు.. ఆపై నవ్వుతూ కెమెరాకు ఫోజిచ్చిన సైకో.. నెటిజన్ల ఫైర్!

ఓ మూగజీవాన్ని అతికిరాతకంగా హింసిస్తూ ఫేస్‌బుక్‌లో ఒక వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంటి టెర్రస్‌పై నిల్చుకుని కుక్కను కూడా గోడపై నిలబెట్టి, నవ్వుతూ వీడియోకి ఫోజివ్వడమే కాదు.. ద

Advertiesment
Sadist
, మంగళవారం, 5 జులై 2016 (14:50 IST)
ఓ మూగజీవాన్ని అతికిరాతకంగా హింసిస్తూ ఫేస్‌బుక్‌లో ఒక వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంటి టెర్రస్‌పై నిల్చుకుని కుక్కను కూడా గోడపై నిలబెట్టి, నవ్వుతూ వీడియోకి ఫోజివ్వడమే కాదు.. దాన్ని మేడపై నుంచి దారుణంగా విసిరేసిన ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తి మూగజీవని కనికరం లేకుండా కుక్కని విసిరేస్తూ ఆనందంగా నవ్వుతూ కెమెరాకు ఫోజిచ్చాడు. ఆ మూగ జంతువు ప్రాణ భయంతో వణికిపోతూ... అరుస్తూ నేలపై పడటాన్ని సైతం స్లో మోషన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఎవరా రాక్షసుడు అని నెటిజన్లు వెతికారు. 
 
అయితే ఇంతటి కిరాతకానికి పూనుకున్నది ఎవరో కాదు చెన్నైకి చెందిన ఓ వైద్య విద్యార్థి. అతని పేరు గౌతమ్ సుదర్శన్.. ఆ వీడియో తీసిన వ్యక్తి పేరు ఆశీష్ పాల్. చెన్నై కుండ్రత్తూరులోని మాధా మెడికల్ కాలేజీ విద్యార్థి. కేసు రిజిస్టర్ చేసిన కుండ్రత్తూరు పోలీసులు వారిని పట్టుకోడానికి వెళ్ళగా అప్పటికే పరారయ్యారట. మెడికల్ స్టూడెంట్స్ అయ్యుండి కూడా మానవత్వం మరిచి ఇలాంటి పనులు చేసినందుకు వాళ్ళపై అందరూ విమర్శలు కురిపిస్తున్నారు. 
 
ఆ రాక్షసులకి తగిన శిక్ష విధించాలని ఫేస్‌బుక్ వినియోగదారులతోపాటు జంతు ప్రేమికులు ఆందోళన చేపట్టారు. అంతేకాదు వీడియోలోని వ్యక్తిని పట్టుకుని అప్పగించిన వారికి, లక్ష రూపాయల రివార్డును అందజేస్తామని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ సభ్యుడు శాలీ కన్నన్ ప్రకటించారు. ఇప్పటికే సదరు వీడియోపై సైబర్ క్రైం సెల్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆ వీడియోను ఇప్పటికే కొన్ని వేలమంది వీక్షించారు. వీడియోను చూసిన ప్రతివారూ షేర్ చేయడం వల్ల ఆ క్రూర స్వభావంగల వ్యక్తిని త్వరలో పట్టుకునే అవకాశం ఉంటుందంటూ కొందరు తమ కామెంట్లతో రిక్వస్ట్‌లు కూడా చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడలి వేధింపులు.. భర్తతో పాటు అత్తామామల ఆత్మహత్య.. ఎక్కడ?