Publish Date: Tue, 12 Aug 2014 (17:26 IST)
Updated Date: Tue, 12 Aug 2014 (17:29 IST)
తమిళనాడులో ఉన్న తెలుగు పాఠశాలల్లో తమిళ ఉపాధ్యాయుల నియామకాలు జరిపారా...? అలాంటివి చేపడితే అది ఎప్పట్నుంచి జరుగుతోంది..? ఒకవేళ అలా నియమించి ఉన్నట్లయితే తెలుగు పాఠశాలల్లో ఎంతమంది తమిళ ఉపాధ్యాయులను రిక్రూట్ చేశారు...? అసలు తెలుగు పాఠశాలల్లో ఎన్నింటిలో తమిళ ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు...? అంటూ మద్రాసు హైకోర్టు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదిపై ప్రశ్నల వర్షం కురిపించింది.
దీనికి కారణం... నిర్బంధతమిళం విద్యా చట్టాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో ఉన్న తెలుగు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించిన నేపధ్యంలో జరిగింది. కాగా తమిళనాడులో ఉన్న తెలుగు పాఠశాలల్లో పని చేస్తున్న తమిళ ఉపాధ్యాయులకు సంబంధించిన లెక్కలు మరో వారంలోపు సమర్పిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.