చెన్నైలో దారుణం : భార్యాబిడ్డను కారులో పెట్టి నిప్పంటించిన భర్త... ఎందుకు?
తమిళనాడు రాష్ట్ర రాజధాన చెన్నైలో ఓ దారుణం జరిగింది. టాక్సీ డ్రైవర్ ఒకరు తన భార్యాబిడ్డను కారులో బంధించి పెట్రోల్ పోసి తగలుబెట్టాడు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ దారుణం జరిగింది. టాక్సీ డ్రైవర్ ఒకరు తన భార్యాబిడ్డను కారులో బంధించి పెట్రోల్ పోసి తగలుబెట్టాడు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
స్థానిక చెన్నై తేనాంపేటకు చెందిన టాక్సీ డ్రైవర్ నాగరాజ్ తన భార్య ప్రేమ, రెండేళ్ల కొడుకుతో కలిసి కారులో ప్రయాణించారు. మార్గమధ్యంలో నాగరాజ్ అతని భార్య ప్రేమకు చిన్న గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి గురైన ప్రేమ భార్య కారులో ఉన్న పెట్రోల్ తీసి తనపై పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని భర్తను బెదిరించింది.
ఇదే అదనుగా భావించిన నాగరాజ్ కారు దిగి అగ్గిపుల్లతో కారుకు నిప్పంటించాడు. వెంటనే మంటలు చెలరేగగానే ప్రేమ తన రెండేళ్ల కుమారుడితో కారు సీట్లో నుంచి కిందికి దూకేసింది.
అప్పటికే వారిద్దరు బాగా కాలిపోయారు. ఈ విషయాన్ని స్థానికులు వెంటనే వారిద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ శరీరం పూర్తిగా కాలిపోవడంతో చికిత్స ఫలించక ఇద్దరు తుది శ్వాస విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి టాక్సీ డ్రైవర్ అరెస్టు చేసి అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.