Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కామెడీగా మారిన ప్రధాని మోడీ చెన్నై విహంగ వీక్షణం.. మార్ఫింగ్‌తో చిత్రవిచిత్ర ఫోటోలు

Advertiesment
PIB turns pm aerial survey as comedy
, శుక్రవారం, 4 డిశెంబరు 2015 (15:47 IST)
చెన్నై వరదలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విహంగ వీక్షణం ఇపుడు ఓ కామెడీ షోగా మారిపోయింది. ఈ విహంగ వీక్షణపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఎప్పటికపుడు ప్రత్యేక బులిటెన్‌తో పాటు.. ఫోటోలను విడుదల చేసింది. ఇపుడు ఈఫోటోలే పీబీఐకి తలనొప్పి తెచ్చిపెట్టగా, నెటిజన్లకు కామెడీ షోను చూపిస్తున్నాయి. 
 
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం ఛాపర్‌లోని విండో ద్వారా వీక్షిస్తున్న ఓ ఫోటోను పీఐబీ తొలుత విడుదల చేసింది. ప్రధాని అస్పష్టంగా ఉన్న పరిసరాలను వీక్షిస్తున్నట్లుగా ఉన్న ఓ ఫోటోను పీఐబీ మొదటగా పోస్ట్ చేసింది. ఇదే పీఐబీ వెనువెంటనే చెన్నై నగరం నీటిలో మునిగినట్లు స్పష్టంగా ఉన్న మరో ఫోటోను ట్వీట్ చేసింది.
webdunia
 
 
ఫోటోలో నగర వీధులు, భవనాలు, వాటి పైకప్పులు స్పష్టంగా కనిపింస్తున్నాయి. గమనించిన ఫాలోవర్లు ఫోటోషాప్ ద్వారా మార్ఫింగ్ చేసిన ఫోటోను పీఐబీ ఎందుకు ట్వీట్ చేసిందని ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విటర్ ఫాలోవర్స్ ఫోటోషాప్ ఇప్పుడు ప్రభుత్వ అధికారిక వ్యూహాంగా మరిందని విమర్శించారు. ఇదేవిషయాన్ని పలువురు కామెడీగా మార్చేశారు. 
 
తొలుత టర్కీ సైన్యం దాడిలో రష్యా యుద్ధవిమానం కూలిపోవడాన్ని ప్రధాని వీక్షిస్తున్నట్లుగా, బాబా సెహగల్‌ ఫోటో ఫోజును వీక్షిస్తున్నట్టుగా, మార్స్ గ్రహా కక్ష్యలో విహరిస్తున్నట్లుగా, రాందేవ్ బాబా ప్రవేశపెట్టిన నూడిల్స్‌ ప్యాకెట్‌ను తిలకిస్తున్నట్టుగా ఇలా పలు రకాలుగా సెటైర్లు వేశారు. 

Share this Story:

Follow Webdunia telugu