Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయ మృతి మర్మం చిక్కుముడిని విప్పేందుకే ఈ ధర్మయుద్ధం: పళనిస్వామిని శశికళ బినామీ అన్న పన్నీర్

ఎడపాడి పళనిస్వామి’ అంటూ మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం ధ్వజమెత్తడంతో అన్నాడీఎంకే విలీనం చర్చలకు ఎలాంటి సూచనలు కనిపించకుండా పోయాయి.

జయ మృతి మర్మం చిక్కుముడిని విప్పేందుకే ఈ ధర్మయుద్ధం: పళనిస్వామిని శశికళ బినామీ అన్న పన్నీర్
హైదరాబాద్ , సోమవారం, 8 మే 2017 (01:51 IST)
అన్నాడీఎంకే ప్రత్యర్థి వర్గాల మధ్య విలీనానికి సంబంధించి ఏమోలో ఉన్న ఆశలు అడుగంటిపోయాయి. ‘శశికళ బినామీ ఎడపాడి పళనిస్వామి’ అంటూ మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం ధ్వజమెత్తడంతో అన్నాడీఎంకే విలీనం చర్చలకు ఎలాంటి సూచనలు కనిపించకుండా పోయాయి.కొట్టివాక్కం వైఎంసీఏ మైదానంలో జరిగిన అమ్మ వర్గం కాంచీపురం ఈస్ట్‌ జిల్లా కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం మాట్లాడుతూ కాంచీపురం జిల్లాలో ధర్మయుద్ధం మొదటి సమావేశం ప్రారంభించామన్నారు.
 
ఈ సమావేశంలో పన్నీర్ సెల్వం సంచలన ప్రకటన చేశారు. శశికళ బినామీ ఎడపాడి పళనిస్వామి అని, తమరు ఎవరి పిడికిట్లో ఉంటూ పాలన సాగిస్తున్నారో అక్కడి నుంచి బయటికి రావాలని కోరారు. అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీగా ఉండాలంటూ ఎంజీఆర్, జయలలిత లక్ష్యం ఏర్పాటుచేసుకున్నారని, అలాంటి పార్టీ ఒక కుటుంబం గుప్పిట్లోకి వెళ్లకూడదని చెప్పారు. ప్రస్తుతం సీఎం ఎడపాడి పళనిస్వామి వేరొక మార్గంలో పయనిస్తున్నారని, ఇంకా ప్రధాన కార్యదర్శిగా శశికళ, ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్‌ ఉన్నారన్నారు. ప్రజలు మోసపోయారని, శశికళ వర్గం కపట నాటకంగా గ్రహించగలరని తెలిపారు. 
 
తాము తలపెట్టిన ఈ ధర్మయుద్ధానికి రాష్ట్ర ప్రజలు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. సుమారు 74 రోజులుగా చికిత్స పొందుతున్న జయలలిత పూర్తిగా కోలుకుంటారని భావించామని, అయితే ఆమె మరణించిన వార్త ఏడున్నర కోట్ల తమిళ ప్రజలు, ప్రపంచ తమిళుల గుండెల్లో కలత రేకెత్తించిందన్నారు. ఆమెను కాపాడుకోలేకపోయామన్న ఆవేదన ఉందని, జయ మృతి మర్మం చిక్కుముడిని విప్పేందుకే ఈ ధర్మయుద్ధమని ఆయన పేర్కొన్నారు. దీని కోసమే సీబీఐ విచారణ కోరుతున్నట్లు తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రెయినీ పైలట్ల చేతిలో పాక్ విమానం. గుర్రుపెట్టిన రెండు గంటలు నిద్రపోయిన పైలట్.. గాల్లో 305మంది ప్రయాణాలు