Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆత్మహత్య బాటలో శశికళ: పెరిగిన షుగర్ లెవల్స్.. వైద్యానికి వ్యతిరేకత

అన్నాడిఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ ఆత్మహత్య బాటలో నడుస్తున్నారా.. తమిళనాడు అధికార రాజకీయాల్లో పట్టు సాధించటానికి చేయకూడని పనులు చేసి ఘోరంగా అభాసుపాలైన శశికళ ఇక బతికి ఉండీ ప్రయోజనం లేదనే నిరాశతో జీవితాన్ని ముగించుకునే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస

ఆత్మహత్య బాటలో శశికళ: పెరిగిన షుగర్ లెవల్స్.. వైద్యానికి వ్యతిరేకత
హైదరాబాద్ , సోమవారం, 1 మే 2017 (11:32 IST)
అన్నాడిఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ ఆత్మహత్య బాటలో నడుస్తున్నారా.. తమిళనాడు అధికార రాజకీయాల్లో పట్టు సాధించటానికి చేయకూడని పనులు చేసి ఘోరంగా అభాసుపాలైన శశికళ ఇక బతికి ఉండీ ప్రయోజనం లేదనే నిరాశతో జీవితాన్ని ముగించుకునే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జైల్లో ఉన్న  రెండు నెలలకే షుగర్ లెవల్స్ 440కి పెరిగినా వైద్య చికిత్సకు నిరాకరించడం, తీవ్ర డిప్రెషన్‌లో మునిగిపోవడం, పెద్దపెట్టున రోదించడం చూస్తుంటే ఆమె ఆరోగ్యం విషమించినట్లే భావించాల్సివస్తోంది. 
అక్రమాస్తుల కేసుకు సంబంధించి పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ఆరోగ్యం క్షీణిస్తోంది. తీవ్ర వేదన, మానసిక ఒత్తిడిలో వున్న ఆమె చక్కెర స్థాయులు 440కు పెరిగినట్లు విశ్వసనీయ సమాచారం. జైలుకెళ్లిన 75 రోజుల్లోనే ఆమె 15 కిలోలకు పైగా బరువు తగ్గారని తెలిసింది. మరదలు ఇళవరసి, అక్క కొడుకు సుధాకరనలతో కలిసి శిక్ష అనుభవి స్తున్న శశికళ చాలాకాలంగా బంధువులను కలవడంలేదు. 
 
జైలులో తనను కలవడానికి వచ్చిన బంధువులు కొన్ని ఆస్తులు తమపేరు మీద రాయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని, దీంతో శశికళ వారిని కలవడానికి ఇష్టపడలేదంటూ ఆమె సన్నిహితనేత ఒకరు తెలిపారు. జైలువద్దకు వచ్చినప్పుడు తన బాగోగుల గురించి అడగకుండా తన ఆధీనంలో వున్న ఆస్తులు, బినామీల వద్ద వున్న ఆస్తులను తమకు అప్పగించాలని అడుగుతుండడంతో శశికళ మనస్తాపం చెందారన్నారు. 
 
ఒకానొక దశలో ఆమె తీవ్రమైన డిప్రెషనలోకి వెళ్లారని, జయతో పాటు భగవంతుడు తననుకూడా ఎందుకు తీసుకెళ్లలేదంటూ తరచుగా పెద్దపెట్టున రోదిస్తున్నారని జైలువర్గాలు అన్నాడీఎంకే నేతల వద్ద వ్యాఖ్యానించాయి. తాజాగా అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలుకూడా ఆమెను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. అధికారంనుంచి తనను దూరం చేసినా, పార్టీ నుంచి ఆ భగవంతుడుకూడా దూరం చేయలేడంటూ జైలుకెళ్లే ముందు శశికళ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. 
 
అయితే అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ అన్నాడీఎంకే నేతలు ప్రస్తుతం ఆమెను పార్టీకి దూరంగానే పెట్టారు. ఈ వ్యవహారంకూడా శశికళను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని, వీటన్నింటి నేపథ్యంలో ఆమె సుగర్‌ లెవెల్‌ పెరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుదురుగా ఉంటేవుండండి.. లేదా వెళ్లిపోండి : యడ్యూరప్ప - ఈశ్వరప్పలకు అమిత్ షా వార్నింగ్