Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుదురుగా ఉంటేవుండండి.. లేదా వెళ్లిపోండి : యడ్యూరప్ప - ఈశ్వరప్పలకు అమిత్ షా వార్నింగ్

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, మరో సీనియర్ నేత ఈశ్వరప్పలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. కుదురుగా పార్టీలో ఉండండి లేదా వెళ్లిపోండంటూ హెచ్చరించారు. ముఖ్యంగా యడ్యూరప్పకు క్లాస్ తీ

కుదురుగా ఉంటేవుండండి.. లేదా వెళ్లిపోండి : యడ్యూరప్ప - ఈశ్వరప్పలకు అమిత్ షా వార్నింగ్
, సోమవారం, 1 మే 2017 (11:23 IST)
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, మరో సీనియర్ నేత ఈశ్వరప్పలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. కుదురుగా పార్టీలో ఉండండి లేదా వెళ్లిపోండంటూ హెచ్చరించారు. ముఖ్యంగా యడ్యూరప్పకు క్లాస్ తీసుకున్న అమిత్ షా ఏమైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత వేదికలపై చూసుకోవాలని హితవు పలికినట్టు సమాచారం.
 
ఇటీవలికాలంలో కర్నాటక బీజేపీ శాఖలో ముఠా గొడవలు ఎక్కువయ్యాయి. దీంతో నిత్యమూ విమర్శలు, ప్రతి విమర్శలతో గొడవలు జరుగుతున్నాయి. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప, కేఎస్ ఈశ్వరప్ప వర్గాలే అసలు కారణంగా ఉన్నాయి. దీంతో ఇరు వర్గాల్లో ఇద్దరేసి నేతలపై బహిష్కరణ వేటు వేశారు.
 
ఇదేసమయంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. దీనికి రాష్ట్ర రాజకీయ నేతలు ముఠా తగాదాలే కారణమని తేలింది. దీంతో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడమే కాకుండా, తప్పు మాది కాదంటే, మాది కాదని, అవతలి వర్గంపై చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు ఫిర్యాదులు కూడా చేశారు.
 
దీంతో సీరియస్ అయిన అమిత్ షా... యడ్యూరప్ప, ఈశ్వరప్పలకు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకునేటట్లయితేనే పార్టీలో ఉండాలని, లేదంటే మీ ఇష్టం అని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. 2018లో రాష్ట్రానికి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తుంటే, ఈ తరహా ఫిర్యాదులు, విభేదాల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని, దీన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. దీంతో ఖంగుతున్న యడ్యూరప్ప, ఈశ్వరప్పలు ఏం చేయాలో దిక్కుతోచక మిన్నకుండిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్ మంచోడు... రాజకీయాలకు సరైనోడు కాదు: మంత్రి సోమిరెడ్డి