Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిర్యాని తింటున్న బస్సు కండక్టురుపై దాడి... పరిస్థితి విషమం

Advertiesment
chennai crime
రోడ్డుపై అవతలి వాడిది తప్పయినా మనమే తల వంచుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఎప్పుడో వచ్చిందనుకోండి. ఇపుడు రోడ్డు మీదే కాదు... తినే చోట, నడిచే చోట, మాట్లాడే చోట గబుక్కున ఎవరైనా మనల్ని రాసుకుంటూ, వాడికెవడికో ఓ దెబ్బ కొట్టాలనిపిస్తే కొట్టినా నోర్మూసుకోవాలేమోనన్న పరిస్థితి వచ్చేసింది. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే, చెన్నైలోని బేసిన్ బ్రిడ్జి వద్ద తమిళనాడు బస్సు కండక్టురు ఒకాయన డ్యూటీ ముగించుకుని ప్రక్కనే బిర్యాని హోటల్ వద్ద తినేందుకు వెళ్లాడు. అతడు బిర్యానీ తింటున్న సీటుకు దగ్గర్లో మరో నలుగురు వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ నలుగురికీ, ఇతనికి ఎక్కడ తేడా వచ్చిందో కానీ... ఫట ఫట ఫటమంటూ చావబాదేశారు కండక్టరుని. 
 
ఆ దెబ్బలకు అతడు తీవ్రంగా గాయపడటమే కాకుండా మూర్ఛపోయాడు. దీంతో అతడిని వెంటనే సమీపంలో స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu