Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండియా నెక్ట్స్ 5వ ఎడిషన్‌కు ఎంట్రీలను ఆహ్వానిస్తున్న అల్ట్రాటెక్

ఇండియా నెక్ట్స్ 5వ ఎడిషన్‌కు ఎంట్రీలను ఆహ్వానిస్తున్న అల్ట్రాటెక్
, సోమవారం, 27 డిశెంబరు 2021 (23:25 IST)
గ్రే సిమెంట్, వైట్ సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రటీట్‌కు సంబంధించి భారతదేశ అతిపెద్ద తయారీ సంస్థ అయిన అల్ట్రాటెక్ ఇండియా తన ఇండియా నెక్ట్స్ 5వ ఎడిషన్‌కు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు, నిపుణులు, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ రంగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆహ్వానాలు పంపింది.

 
ఈ ఏడాది ఇండియా నెక్ట్స్ ఇన్షియేటివ్ ‘బిల్డ్ విత్ స్పీడ్’. దేశానికి చెందిన ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్లు ఒక ప్రాజెక్టును ఎంచుకునేందుకు పోటీ పడుతారు. అది పట్టణ లేదా గ్రామీణ నేపథ్యంతో వినూత్నతతో కూడుకున్నదై, ప్రజలపై ప్రభావం కలిగించేదిగా, భారత్ తన సుస్థిరదాయక అభివృద్ధి ఆశయాలు (ఎస్డీజీ)ను సాధించేందుకు తోడ్పడేదిగా ఉండాలి.

 
అధునాతన సాంకేతికతలు, ప్రక్రియలు, మెటీరియల్స్‌తో ఇంటి నమూనాలను అభివృద్ధి చేయడం ‘బిల్డ్ వి త్ స్పీడ్’ ఆశయం. అది భారతదేశ వృద్ధి గాధను పునర్లిఖించేదిగా ఉండాలి. దేశ గృహనిర్మాణ అభివృద్ధి ప్రాథమ్యాలను నిర్దేశిత కాలవ్యవధిలో నెరవేర్చేదిగా, దానికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేదిగా ఉండాలి. 

 
ఇందులో పాల్గొనే వారు పట్టణ నేపథ్యాన్ని ఎంచుకుంటే వారు వలస కార్మికుల లేదా మురికివాడల్లోని ప్రజల పునరావాసం అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకునే వారు నిరాశ్రయులు లేదా వలస కార్మికుల కోసం ఉద్దేశించిన హౌసింగ్ పరిష్కారాలను వృద్ధి చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గ్రామీణ నేపథ్యంపై వచ్చే ఎంట్రీలు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ్ (పీఎంఏవై-జి) వంటి ప్రభుత్వ పథకాలకు లబ్ధి చేకూర్చేలా సామూహిక తక్కువ వ్యయ ఇంటి నిర్మాణాలపై కూడా దృష్టి సారించవచ్చు.

 
ఈ ఏడాది ఎంట్రీలన్నీ కూడా ఆన్లైన్ లోనే ఆమోదించబడుతాయి. విస్తృత శ్రేణికి చెందిన పరామితులతో నిపుణుల కమిటీచే మదింపు చేయబడుతాయి. వేగవంతమైన నిర్మాణం, సృజనాత్మకత, వినూత్నత, ప్రాజెక్ట్ మన్నే కాలం, ఉపయోగించిన సాంకేతికత, మెటీరియల్స్, భారీస్థాయి అమలు, అది కలిగించే ప్రభావం లాంటివి వీటిలో ఉంటాయి.
 
ఎంట్రీల దాఖలుకు చివరి తేదీ: 31 జనవరి, 2022
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 2022 నాటికి 5500 మెట్రిక్‌ టన్నుల ఇ-వ్యర్ధాలను ఆర్గానిక్‌గా సేకరించడం లక్ష్యంగా క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌