Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2018లో మీ కెరీర్... మీ చేతుల్లోనే... ఏం చేయాలి?

2017 ముగిసింది. 2018 వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం బెస్ట్ కెరీర్‌ కోసం ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలో తెలుసుకుందాం.. కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుని పనిచేసే ఉద్యోగాలు బోర్ కొట్టేస్తే.. కొత్త వ్యాపారం మొదలెట్టండి. ఉద్యోగం చేస్తుంటే కొత్త వ్యాపారానికి

2018లో మీ కెరీర్... మీ చేతుల్లోనే... ఏం చేయాలి?
, శుక్రవారం, 29 డిశెంబరు 2017 (13:47 IST)
2017 ముగిసింది. 2018 వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం బెస్ట్ కెరీర్‌ కోసం ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలో తెలుసుకుందాం..  కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుని పనిచేసే ఉద్యోగాలు బోర్ కొట్టేస్తే.. కొత్త వ్యాపారం మొదలెట్టండి. ఉద్యోగం చేస్తుంటే కొత్త వ్యాపారానికి నాంది పలకండి. వ్యక్తిగత వ్యాపారాల ద్వారా రాణించేందుకు ఆలోచించండి. 
 
1. బెస్ట్ కెరీర్‌ కోసం ఎక్కడో వెతకనక్కర్లేదు. ఇప్పుడు కావాల్సినంత సమాచారం అంతర్జాలంలో లభిస్తోంది. కనుక అంతర్జాలంలో శోధించి నిర్ణయాలు తీసుకోండి. శోధించి నచ్చిన విషయాలను పేపర్‌పై రాసుకోండి. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తెలుసుకునేందుకు నిపుణుల సలహా కూడా తీసుకోవాలి. చేసే వ్యాపారంపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. అందుకు పక్కాగా ముందుగానే ప్రిపేర్ కావాలి. 
 
2. పరిశ్రమ ఏర్పాటు లేదా వృత్తికి సంబంధించిన, అవసరమైన వాటిని కొనుగోలు చేయండి. సొంత వాహనం సిద్ధంగా వుంచుకోవాలి. సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త సంవత్సరంలో నేర్చుకోవాలనుకుంటున్న అంశాలను డైరీలో రాసుకోండి. బయట వ్యక్తులతో ఎలా మాట్లాడాలో నిర్ణయించుకోండి. స్కిల్స్ డెవలప్ చేసుకోండి. రైటింగ్ స్టైల్ మార్చండి. 
 
3. స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవండి. లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా శ్రమించాలి. ఉద్యోగులైతే ప్రమోషన్‌పై కన్నేయాలి. చేసే పనిలో అభివృద్ధి ఉందా అనేది గమనించాలి. కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తూనే వుండాలి. రోజుకు రోజు వ్యత్యాసం కనిపెట్టాలి. కెరీర్ పరంగా రాణించేందుకు ఏం చేయాలనే అంశాలు పేపర్‌పై రాసుకుని వాటిని అమలు పరచండి.
 
4. విజయాన్ని అందుకునేందుకు కొత్త సంవత్సరంలో రెజ్యూమ్‌ను లింక్డిన్‌లో పోస్ట్ చేయండి. వృత్తిపరమైన, ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషించండి. సహోద్యోగుల సలహాలు తీసుకోండి. స్నేహితుల సూచనలు తీసుకోవచ్చు. వృత్తి, పరిశ్రమ, ఉద్యోగం కోసం పెట్టుబడి ఎంత మేరకు పెట్టాలో నిర్ణయించుకోండి. ఉద్యోగవకాశాలు, విద్యావకాశాలపై కూడా పరిశోధన చేయండి. వృత్తి, ఉద్యోగాలపై జరిగే సెమినార్లకు హాజరైతే మంచి ఆలోచనలు లభిస్తాయి. 
 
5. లక్ష్యాన్ని చేధించేందుకు లోతుగా పరిశోధన చేయండి. చేసే పనిని ఆసక్తితో చేయండి. విశ్రాంతి తీసుకుంటూ మెదడుకు పనిచెప్పండి. ఆలోచనల ద్వారా లక్ష్యం మీ చేతుల వద్దకు వచ్చేలా చేయండి. లక్ష్యం గురించి 24 గంటలూ ఆలోచించకుండా 15 నిమిషాలు ఆలోచించినా కార్యాచరణకు తగిన అంశాలుండేలా చూసుకోవాలి. 
 
6. కెరీర్‌లో రాణించేందుకు నెట్‌వర్క్‌ను క్రమం చేసుకోండి. ఈవెంట్స్‌ను రాసుకోండి. సహోద్యోగులతో, మాజీ ఉద్యోగులతో టచ్‌లో వుండండి. విద్యార్థులైతే మాజీ విద్యార్థులతో సమావేశం కావొచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయం కూడా అవకాశాలను అందుకునేందుకు వారధి అవుతుంది. కొత్త సంవత్సరంలో చేసే పనిని క్యాలెండర్‌లో గుర్తుంచుకోండి. వాటిపై టిక్ చేసుకోవడం ఎంతో మేలు. 
 
7. మాటల్లో స్వచ్ఛత ఉండేలా చూసుకోవాలి. నేవీ సీల్ కమాండర్ అడ్మిరల్ విలియమ్ హెచ్.మెక్‌రావెన్ ప్రసంగాన్ని వినండి. సోషల్ మీడియా, టీవీల్లో వచ్చే ప్రకటనల పట్ల జాగ్రత్త వహించండి. ఆచితూచి అడుగేయడం అవసరం. కెరీర్‌కు దోహదపడే పాఠ్యాంశాలను ఎంచుకోవడం మంచిది. కోర్సుల కోసం నెట్లో శోధించి తెలుసుకోండి. ఉద్యోగం చేస్తూనే కెరీర్‌ వృద్ధి కోసం కొన్ని టెక్నికల్ కోర్సులు చదవడం చేయొచ్చు. 
 
8. కెరీర్‌లో రాణించాలంటే సమయం పట్టొచ్చు. నిరాశ, అపజయాలు కూడా తప్పకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో విసుగు చెందకుండా ఎంచుకున్న నిర్దేశాన్ని పూర్తి చేసేందుకు ముందడుగు వేయాలే తప్ప వెనుకడుగు మాత్రం వేయకూడదు. సమయాన్ని వృధా చేయకూడదనే అంశాన్ని గుర్తించుకోవాలి. ఒత్తిడిని పక్కనబెట్టాలి. అప్పుడే కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేర్చేందుకు మీ మెదడు సహకరిస్తుంది. ఇందుకోసం ధ్యానం, వ్యాయామం, యోగా వంటివి అరగంట పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
9. వ్యక్తిగతంగా కెరీర్‌లో రాణించాలంటే స్ఫూర్తిని నమ్మాలి. ఇతరుల స్ఫూర్తితో ముందడుగు వేయాలి. ఇందు కోసం స్నేహితులు, శ్రేయోభిలాషులు, కోచ్‌ల సాయం కూడా తీసుకోవచ్చు. మీ చుట్టూ పటిష్టమైన ఆహ్లాదకరమైన వ్యక్తుల సామూహాన్ని ఏర్పరుచుకోండి. నమ్మకస్తులను పక్కనబెట్టుకోండి. నిరాశ పరిచే వారిని దూరంగా వుంచండి. అపజయాలొచ్చినా ప్రోత్సహించే వారిని నమ్మండి. అప్పుడే మీ మెదడు విజయబాటలో ప్రయాణిస్తుంది. ఫలితంగా కొత్త సంవత్సరం కొత్త కెరీర్‌ను మీకు అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారు, బైకులకు బీమా చేస్తారు కానీ తమకు మాత్రం... 2018లోనైనా నిర్ణయించుకోండి...