క్యాంపస్ ఇంటర్వ్యూలు : విద్యార్థికి రూ.1.40 కోట్ల ప్యాకేజీ
క్యాంపస్ ఇంటర్వ్యూలో ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థి జాక్‌పట్ కొట్టాడు. సంవత్సరానికి రూ.1.40 కోట్ల వేతన ప్యాకేజీతో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే
క్యాంపస్ ఇంటర్వ్యూలో ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థి జాక్‌పట్ కొట్టాడు. సంవత్సరానికి రూ.1.40 కోట్ల వేతన ప్యాకేజీతో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో శుక్రవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఈ ఇంటర్వ్యూల్లో ఐఐటీ-ఢిల్లీ, రూర్కెలా, గౌహతి, ముంబై, మద్రాస్‌కి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు రూ.కోటి పైగా పారితోషికాలతో ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలను దక్కించుకున్నారు.
వీరిలో ఐఐటీ-ఢిల్లీకి చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి టెక్ దిగ్గజం మైకోసాఫ్ట్ రూ.1.4 కోట్ల ఆఫర్ చేసింది. ప్రాంగణ నియామకాల్లో ఇప్పటివరకు ఏ ఐఐటీ విద్యార్థి కూడా ఇంత భారీ ప్యాకేజీ పొందలేదు. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్ విద్యార్థి కూడా రూ.1.39 కోట్లు మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసింది. కోటికి పైగా వేతనంతో ఉద్యోగాలు పొందిన వారిలో ఐఐటీ ఢిల్లీ నుంచి నలుగురు, ముంబై నుంచి ముగ్గురు, మద్రాస్ నుంచి ఒకరు ఉన్నారు.