వరంగల్ నిట్ విద్యార్థికి రూ.80 లక్షల జీతం.. ఏ కంపెనీ ఆఫర్
వార్షిక వేతనం రూ.80లను వరంగల్ నిట్ విద్యార్థి అందుకోనున్నారు. మోర్గాన్ స్టాన్లీ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైనందుకు ఈ మొత్తం చెల్లించనున్నారు. ఈ విద్యార్థి వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(ఎన్‌ఐటీ)లో
వార్షిక వేతనం రూ.80లను వరంగల్ నిట్ విద్యార్థి అందుకోనున్నారు. మోర్గాన్ స్టాన్లీ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైనందుకు ఈ మొత్తం చెల్లించనున్నారు. ఈ విద్యార్థి వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(ఎన్‌ఐటీ)లో ఈసీఈ విభాగంలో బీటెక్ ఆఖరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నాడు.
అమెరికాకు చెందిన మోర్గాన్ స్టాన్లీ కంపెనీలో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఈ విద్యార్థి ఎంపికయ్యాడు. నిట్ క్యాంపస్‌లో చేపడుతున్న ప్రాంగణ ఎంపికల్లో భాగంగా అత్యధిక ప్యాకేజీతో నిట్ విద్యార్థికి ఈ కొలువు లభించింది. నిట్‌లో చదువుతున్న విద్యార్థులు 90 శాతం మంది కొలువులకు ఎంపికవుతున్నట్లు అధ్యాపకులు తెలిపారు. ఐదేళ్లుగా ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, పెప్సీకో తదితర కంపెనీలలో ఏడాదికి రూ.50 నుంచి 65 లక్షల ప్యాకేజీలతో విద్యార్థులు కొలువులకు ఎంపికవుతున్నారు.
కంప్యూటర్‌సైన్స్, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాల విద్యార్థులు రూ.10 లక్షల కంటే అధిక ప్యాకేజీలతో 90 శాతానికి పైగా ప్రాంగణ ఎంపికల్లో కొలువులు దక్కించుకుంటున్నారు. సాధారణంగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ సంస్థలు అత్యధిక ప్యాకేజీలు ఆఫర్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి మాత్రం ఈసీఈ విద్యార్థిని స్టాక్‌ఎక్చేంజ్ కంపెనీ అత్యధిక ప్యాకేజీతో ఎంపిక చేసుకోవడం విశేషం.