Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతదేశంలో తొలిసారిగా స్టూడెంట్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ విడుదల చేసిన లీడ్‌

students
, ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (21:12 IST)
ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం ఆత్మ-విశ్వాస్‌ సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా భారతదేశంలో అతిపెద్ద స్కూల్‌ ఎడ్‌టెక్‌ కంపెనీ లీడ్‌ నేడు భారతదేశపు మొట్టమొదటి ‘స్టూడెంట్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌’ విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ అధ్యయనం ద్వారా పాఠశాలలకు వెళ్తోన్న విద్యార్ధుల ఆత్మవిశ్వాస స్థాయిని ప్రాంతాలు, నగరాలు, జనాభా- ఇతర అంశాల ఆధారంగా పరిశీలించారు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌‌తో భాగస్వామ్యం చేసుకుని విడుదల చేసిన లీడ్‌ యొక్క ఇండెక్స్‌ పలు ఆసక్తికరమైన అంశాలను విద్యార్ధుల ఆత్మవిశ్వాసం పరంగా వెల్లడించింది. ఇండియా ఆత్మవిశ్వాస స్థాయి 100గా ఉన్న స్కేల్‌పై 75గా ఉంటే, 36% మంది విద్యార్థులు అత్యున్నత ఆత్మవిశ్వాస స్థాయి (81-100) చూపారు.
 
 
హైదరాబాద్‌ ఇండెక్స్‌ స్కోర్‌ 87గా ఉంటే, అంబాలాలో ఈ ఇండెక్స్‌ స్కోర్‌ 62గా ఉంది. తద్వారా స్కోర్‌ పరంగా 25 అంతరం చూపడమే కాదు భారతదేశపు మెట్రో నగరాల విద్యార్థులు మెట్రోయేతర నగరాల్లోని తమ సహచర విద్యార్ధులతో పోలిస్తే ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. ఆసక్తికరంగా లీడ్‌ విద్యార్థులు మెట్రోయేతర నగరాల్లోని తమ సహచర విద్యార్థులతో పోలిస్తూ ఆత్మవిశ్వాస పరంగా అన్ని అంశాలలోనూ మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు.

 
అంతేకాదు, మెట్రో నగరాల్లోని విద్యార్థులకు మెట్రోయేతర నగరాల్లోని తమ సహచర విద్యార్థులతో పోలిస్తే ఐదు కీలక అంశాలలో ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. లీడ్‌ స్టూడెంట్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ , ఐదు 21వ శతాబ్దపు ఆత్మవిశ్వాసం పెంపొందించే లక్షణాలను పరిశీలించింది. జీవితంలో విజయవంతమయ్యేందుకు విద్యార్థులకు అత్యంత కీలకమైన అంశాలైన ఆ  లక్షణాలు- ఊహాత్మక అవగాహన, విమర్శనాత్మక ఆలోచన, కమ్యూనికేషన్‌, సహకారం- అవకాశాలు, వేదికల పట్ల అవగాహన.
 
పశ్చిమ భారతదేశంలో విద్యార్థుల ఆత్మవిశ్వాస సూచీ ప్రాంతీయ స్ధాయిలో 81గా ఉంది. అదేసమయంలో దక్షిణ-తూర్పు భారతదేశాల్లో ఈ స్ధాయి దాదాపు జాతీయ సగటు దగ్గరలో ఉంది.

 
బాలురతో పోలిస్తే బాలికలు మెరుగ్గా ప్రతిభ కనబరిచిన చెన్నై, ముంబై మినహా మిగిలిన మెట్రోలు- మెట్రోయేతర నగరాలలో బాలురు, బాలికలు దాదాపుగా సమాన స్థాయిలో ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు.

 
ఈ ఇండెక్స్‌ గురించి లీడ్‌ కో-ఫౌండర్‌, సీఈఓ సుమీత్‌ మెహతా మాట్లాడుతూ, ‘‘భారతదేశం ఆత్మనిర్భర్‌ ప్రదర్శిస్తోన్న వేళ మన విద్యార్థులు సైతం ఆత్మవిశ్వాసం ప్రదర్శించాల్సి ఉంది. కానీ మన దేశంలో విద్యార్థుల ఆత్మవిశ్వాస స్ధాయి తెలుసుకునే మార్గమేమీ లేదు. లీడ్‌ యొక్క స్టూడెంట్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ను టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (ఎల్‌ఎంఆర్‌ఎఫ్‌, ఎస్‌ఎంఎల్‌ఎస్‌), భాగస్వామ్యంతో రూపొందించడం ద్వారా ఈ అంతరం పూరిస్తున్నాము. ఇది వార్షిక  అధ్యయనం. దీనిద్వారా మన విద్యార్థుల ఆత్మవిశ్వాస స్థాయిని కనుగొనగలుగుతాము. మా విద్యా కార్యక్రమాల ద్వారా కేంద్రీకృత జోక్యాలను చేయడంలో మాకు సహాయపడుతుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్వారకా శారదా పీఠం స్వరూపానంద స్వామి శివైక్యం