కెఎల్ఈఎఫ్ డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం ఫ్యూచర్‌ఎక్స్: రీ ఇమాజినింగ్ స్పేసెస్ అండ్ రీడిఫైనింగ్ ది ఫ్యూచర్ పేరిట అంతర్జాతీయ సదస్సును వైభవంగా నిర్వహించింది. కెఎల్ఈఎఫ్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గౌరవనీయ పరిశ్రమ నాయకులు, విద్యావేత్తలు మరియు విద్యార్థులను పాల్గొనటంతో పాటుగా ఆర్కిటెక్చర్, డిజైన్ యొక్క అభివృద్ధి చెందుతున్న తీరును అన్వేషించారు.
ఈ సమావేశం మ్యాగజైన్ ట్రోవ్ 2025 విడుదలతో ప్రారంభమైంది, ఇది విద్యార్థుల ప్రాజెక్టులు, కో- కరిక్యులర్ అంశాలు, విద్యా విజయాలు, అధ్యాపకుల సహకారాలను ప్రదర్శిస్తుంది. ప్రొఫెసర్ గిరీష్ మిస్త్రీ (ప్రొఫెసర్ ఎమెరిటస్, పి.పి. సవాని విశ్వవిద్యాలయం, అహ్మదాబాద్), డాక్టర్ ప్రతీక్ సుధాకరన్ (ఆర్కిటెక్ట్ - బిల్డింగ్ సైంటిస్ట్, టెడెక్స్ స్పీకర్, కొచ్చి), ఆర్. ప్రీతీష్ నాయుడు(ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ - APCOST) కీలకోపన్యాసాలను అందించటంతో పాటుగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ ధోరణులు, సాంకేతిక ఏకీకరణపై పరిజ్ఞానం అందించారు. ఆర్కిటెక్ట్ విజయ్ భాస్కర్ (ఛైర్మన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్,ఏపీ చాప్టర్, వైజాగ్), ఆర్కిటెక్ట్. భీమేష్ (ప్రొఫెసర్ & మాజీ డిజైన్ చైర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, వైజాగ్), ఆర్కిటెక్ట్. లక్ష్మణ్ (డైరెక్టర్, లక్ష్మణ్ అసోసియేట్స్, విజయవాడ), డాక్టర్ ఫైజ్ అహ్మద్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్ పి ఏ విజయవాడ)లు సమకాలీన సవాళ్లు, పర్యావరణ పరిరక్షణ, పట్టణ ప్రణాళిక వ్యూహాలను అన్వేషించారు.
రెండవ రోజు డాక్టర్ కో ఇమ్మాన్యుయేల్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్) కీలక ప్రసంగం చేయగా ఆర్కిటెక్ట్ మిథిలా మట్టూ (ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ & ఎంటర్‌ప్రెన్యూర్, ఢిల్లీ) ఏఐ-ఆధారిత డిజైన్ ఆవిష్కరణలు, ప్రాదేశిక ప్రణాళిక భవిష్యత్తుపై ఆకర్షణీయమైన సెషన్‌ను నిర్వహించారు. ప్రత్యేక పూర్వ విద్యార్థుల కనెక్ట్ సెషన్ గత మరియు ప్రస్తుత విద్యార్థుల మధ్య చర్చలను సులభతరం చేసింది, మార్గదర్శకత్వం మరియు వృత్తిపరమైన వృద్ధిని నొక్కి చెప్పింది.
కెఎల్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విభాగాధిపతి ఆర్కిటెక్ట్ ప్రియ మరియు ఇతర అధికారుల స్ఫూర్తిదాయకమైన ముగింపు ప్రసంగంతో సమావేశం గొప్పగా ముగిసింది, ఇది విజ్ఞాన మార్పిడి, నెట్‌వర్కింగ్ మరియు దార్శనిక చర్చలతో నిండిన రెండు రోజుల ముగింపును సూచించింది. కెఎల్ఈఎఫ్ ఫ్యూచర్‌ఎక్స్ అంతర్జాతీయ సమావేశం విద్యార్థులు, అధ్యాపకులు, నిపుణులకు ఒక శక్తివంతమైన వేదికగా నిరూపించబడింది, ఆర్కిటెక్చర్ భవిష్యత్తు, సాంకేతిక పురోగతులు, పర్యావరణ ఆవిష్కరణలపై తాజా దృక్పథాలను అందించింది. ఈ కార్యక్రమం కెఎల్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క విద్యా నైపుణ్యం మరియు పరిశ్రమ అనుసంధానత పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించింది, భవిష్యత్ సహకారాలు, విప్లవాత్మక పరిశోధనలకు మార్గం సుగమం చేసింది.