Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టైపెండ్, రూ. 9 లక్షల ఉపాధి హామీతో ఎంటెక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన అవాంటెల్

Advertiesment
students

ఐవీఆర్

, సోమవారం, 24 మార్చి 2025 (23:52 IST)
హైదరాబాద్: ఉపగ్రహ కమ్యూనికేషన్లు, రక్షణ సాంకేతికతలలో ప్రముఖ సంస్థ, అవాంటెల్ లిమిటెడ్, 'మేక్ ఇన్ ఇండియా', 'స్కిల్ ఇండియా' కార్యక్రమాల పట్ల తమ నిబద్ధతలో భాగంగా, సిగ్నల్ ప్రాసెసింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో రెండేళ్ల ఎంటెక్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం, గీతం విశ్వవిద్యాలయం, వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల (VRSEC)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. AICTE ఆమోదించబడిన కోర్సు జూన్ 2025లో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు గేట్  ద్వారా నమోదు చేయబడతారు.
 
రెండేళ్ల ఎంటెక్ ప్రోగ్రామ్‌లో నాలుగు సెమిస్టర్‌లు ఉంటాయి; మొదటి రెండు సెమిస్టర్‌లలో, విద్యార్థులు తమ విశ్వవిద్యాలయాలలో కోర్ సైద్ధాంతిక నేపథ్యాలపై దృష్టి సారించి తరగతి గది అభ్యాసాన్ని కలిగి ఉంటారు. 3వ మరియు 4వ సెమిస్టర్‌లలో, విద్యార్థులు అవాంటెల్‌లో పూర్తి సంవత్సరం ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని పొందుతారు.
 
విద్యార్థులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడంలో భాగంగా ఈ ప్రోగ్రామ్‌లో ఆర్థిక ప్రోత్సాహకం, కెరీర్ పురోగతి ప్రణాళిక కూడా ఉంది, ఇంటర్న్‌లకు నెలవారీ రూ. 25,000 స్టైఫండ్‌ను అందిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తయిన తర్వాత, గ్రాడ్యుయేట్లు అవాంటెల్‌లో రూ. 9,00,000 వార్షిక సీటీసీతో వుద్యోగం పొందుతారు. 
 
ఈ కార్యక్రమం పట్ల అవాంటెల్ లిమిటెడ్ & iMEDS ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సిద్ధార్థ అబ్బూరి మాట్లాడుతూ, “అవాంటెల్‌ వద్ద , టెక్నాలజీ భవిష్యత్తు మనం నేడు తీర్చిదిద్దుతున్న ప్రతిభపై ఆధారపడి ఉంటుందని నమ్ముతున్నాము. పరిశ్రమ అనుభవం, నిపుణుల మార్గదర్శకత్వం ద్వారా, కమ్యూనికేషన్, సిగ్నల్ ప్రాసెసింగ్‌లో అర్థవంతమైన పురోగతిని సాధించడానికి మేము విద్యార్థులను తీర్చిదిద్దనున్నాము. విద్య మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడం తమ లక్ష్యం’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శామ్‌సంగ్ బెస్పోక్ AI డిజిటల్ ఉపకరణాలపై ప్రత్యేక పండుగ ఆఫర్ల ప్రకటన