Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జేఈఈ మెయిన్ సెషన్స్-1 అడ్మిట్ కార్డులు విడుదల

Advertiesment
students
జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఎన్టీఏ శనివారం విడుదల చేసింది. జనవరి 21, 22, 23, 24 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డుల్ని jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్ష, 29న పేపర్‌ -2 పరీక్ష జరగనున్నాయి. 
 
ప్రస్తుతానికి తొలి నాలుగు రోజుల అడ్మిట్‌ కార్డులను విడుదల చేయగా.. 28, 29 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను తర్వాత విడుదల చేయనున్నారు. మొత్తం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. తొలి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.
 
ఈ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకునేందుకు jeemain.nta.nic.in అనే వెబ్‌సైట్‌ను క్లిక్ చేయాలి. హోంపేజీలో జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డు 2026 సెషన్‌-1కు సంబంధించిన లింక్‌పై క్లిక్‌ చేయాలి. మీ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్‌ అవ్వాలి. జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది. దాన్ని ప్రింటవుట్‌ తీసుకోవచ్చు. 
 
కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోండి. ఏదైనా సమస్య ఉంటే [email protected] ద్వారా ఎన్‌టీఏకు ఫిర్యాదు చేయొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ సక్సెస్ అందుకే మలేషియాలో శుద్ధ్ విలాస్ రెస్టారెంట్ ప్రారంభించాం