Publish Date: Mon, 13 Jun 2016 (10:18 IST)
Updated Date: Mon, 13 Jun 2016 (10:19 IST)
జెఈఈ ఫలితాల్లో చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఎం.చైతన్య నాయక్ ప్రతిభ చూపాడు. ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు (ఎస్టీ కేటగిరి) సాధించాడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన చైతన్య నాయక్‌కు చిన్నప్పటి నుంచే విద్యపై ప్రతిభ కనబరిచేవాడు. చైతన్య ఇంట్రస్ట్‌ను చూసిన తల్లిదండ్రులు కూడా అతన్ని ప్రోత్సహించారు.
తినడానికి తిండి లేకున్నా చైతన్యను మాత్రం చదివించారు. కసితో చదివిన చైతన్య నాయక్ జెఈఈ పరీక్షల్లో మొదటి ర్యాంకును సాధించాడు. తన కుటుంబం ప్రోత్సాహం వల్లనే ఈ ర్యాంకు సాధించినట్లు చైతన్య నాయక్ చెబుతున్నాడు. ఐఎఎస్ అవ్వడమే తన తక్ష్యమని నాయక్ చెబుతున్నాడు.