Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థికి రూ.1.5 కోట్ల వార్షిక వేతనం ఆఫర్!

Advertiesment
iit
ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థికి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఈ ఐఐటీ క్యాంపస్‌లో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో అతనికి 1.5 కోట్ల వార్షిక వేతనంతో కూడిన జాబ్ ఆఫర్ వచ్చింది. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలో మొత్తం 27 కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించగా 163 మందికి అవకాశాలు లభించాయని కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్, ఐఐటీ-ఖరగ్‌పూర్ ఛైర్మన్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్ బరారీ తెలిపారు. 
 
ఈ యేడాది ఓ భారత ఐఐటీ విద్యార్థికి లభించిన అత్యధిక వేతన ఆఫర్ ఇదే కావడం గమనార్హం. ఈ ఆఫర్ విదేశాలకు వెళ్లి పని చేసే ఒప్పందంపై ఆ విద్యార్థికి లభించిందని, ఇక మన దేశంలో పనిచేసే విషయానికి వస్తే ఓ విద్యార్థి రూ.42 లక్షల ప్యాకేజి అందుకున్నాడని తెలిపారు. విద్యార్థి వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. మొత్తం క్యాంపస్ ఇంటర్యూల్లో ఇప్పటి వరకు 251 మందికి జాబ్ ఆఫర్లను లభించినట్టు చెప్పారు. ఇందులో 88 మందికి ముందుగా ఆఫర్లు వచ్చాయన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu