Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

FIITJEE నుంచి JEE మెయిన్ 2024లో ఆల్ ఇండియా ర్యాంక్‌లు 3, 13, 16

students

ఐవీఆర్

, గురువారం, 2 మే 2024 (15:15 IST)
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) 2024 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల ప్రకటించింది. ఈ ఫలితాలతో, FIITJEE విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. తమ నిజాయితీ, అంకితభావం కారణంగా ప్రతి సంవత్సరం నమ్మశక్యం కాని మైలురాళ్లను సాధిస్తోన్న FIITJEE  ఆ వారసత్వం కొనసాగించింది. FIITJEE యొక్క అన్ని క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్‌ల నుండి (క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్+ నాన్-క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్) AIR 1, AIR 3, AIR 13 & AIR 16 పొందిన విద్యార్థులు, JEE మెయిన్ 2024లో విజయ పతాకాన్ని ఎగురువేశారు.
 
ఈ సంవత్సరం ఫలితాలలో అపూర్వ ఫలితాలను కనబరిచిన విద్యార్థులలో.. FIITJEE యొక్క ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ విద్యార్థి గజరే నీల్‌కృష్ణ నిర్మల్‌కుమార్, JEE మెయిన్ 2024లో AIR 1 సాధించారు. FIITJEE యొక్క త్రీ ఇయర్ స్కూల్ ప్రోగ్రామ్ విద్యార్థి ఆరవ్ భట్, JEE మెయిన్ 2024లో AIR 3 సాధించాడు. మరో విద్యార్థి శ్రీయషాస్ మోహన్ కల్లూరి, FIITJEE యొక్క ఫోర్ ఇయర్ క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్ (IX-XII) విద్యార్థి, JEE మెయిన్ 2024లో AIR 13 సాధించాడు. అతను జాతీయ స్థాయి ఆర్చర్ కూడా! శ్రీయషాస్ మోహన్ కల్లూరి 2023-24లో NSEC, IOQM & NSEAలకు కూడా అర్హత సాధించారు.
 
FIITJEE యొక్క రెండు సంవత్సరాల లైవ్ ఆన్‌లైన్ క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థి ముహమ్మద్ సుఫియాన్, JEE మెయిన్ 2024 ఫలితాల్లో AIR 16ని సాధించారు. FIITJEEకి ఇది నిజంగా గర్వకారణం. మా విద్యార్థుల అత్యుత్తమ ప్రదర్శనకు మేము ఎంతో ఆనందిస్తున్నాము. ఇది వారి కష్టానికి, అంకితభావానికి ప్రతిఫలం. మన దేశంలో మాధ్యమిక విద్య విద్యార్థుల విశ్లేషణాత్మక నైపుణ్యాలను, మేధో స్థాయిని పెంచలేకపోతుంది, అందుకే పాఠశాలల్లో బాగా రాణిస్తున్న విద్యార్థులు కూడా పోటీ పరీక్షలలో వెనుకబడి ఉన్నారు. విద్యార్థుల విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం అవసరం, FIITJEE సరిగ్గా అది చేస్తుంది. JEEలో FIITJEE విద్యార్థుల నిరంతర విజయం దాని అసమానమైన బోధనా శాస్త్రం యొక్క సామర్థ్యాన్ని ధృవీకరిస్తుంది. తదుపరి మైలురాయి JEE అడ్వాన్స్‌డ్‌లో మా విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాము అని FIITJEE గ్రూప్ డైరెక్టర్ శ్రీ R.L. త్రిఖా చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖమ్మం ఎన్నికల ప్రచారంలో వెంకీ కుమార్తె ఆశ్రిత... వీడియో వైరల్