Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

NEET UG 2023లో టాప్ పెర్ఫార్మర్స్ చూపిన హైదరాబాద్‌ లోని ఆకాష్ బైజూస్‌కు చెందిన 11 మంది విద్యార్థులు

image
, గురువారం, 15 జూన్ 2023 (16:52 IST)
టెస్ట్ ప్రిపరేషన్ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామి అయిన ఆకాష్ బైజూస్ హైదరాబాద్‌కు చెందిన 11 మంది విద్యార్థులు 2023 NEET UG పరీక్షలో అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఈ ఫలితాలను NTA నిన్న ప్రకటించింది. AIR 139తో 705/720 స్కోరు సాధించిన చిన్మయి వుప్పల, AIR 140తో 705/720ని  లక్షణ్య ఆదికేశవన్, AIR 210తో అభినవ్ ఉపాధ్యాయ్ 700/720, AIR 283తో 700/720, శ్రావణి రెడ్డి పొందారు, AIR 299తో ప్రీతమ్ సిద్ధార్థ్ కొల్లాబత్తుల 700/720, AIR 543తో అద్వైత్ రావు 695/720, AIR 646తో నిఖిల్ T 691/720, AIR 2242 తో  Md. షాజర్ కలీం 675/720, విజయ్‌ కులకర్ణి 690/720తో AIR 694 AIR 678తో నీలాంబిక దమ్మాలపాటి 690/720, AIR 749తో గుండ్లగుట్ట మోక్షితా రెడ్డి 690/720 పొందారు. 
 
నీట్‌ను ఛేదించడానికి రెండు సంవత్సరాల తరగతి గది కార్యక్రమంలో ఈ విద్యార్థులు ఆకాష్ బైజూస్‌లో చేరారు. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడంలో వారు చేసిన కృషి మరియు వారి అభ్యాస షెడ్యూల్‌కు వారు ఖచ్చితంగా కట్టుబడి ఉండడం వల్ల NEETలోని టాప్ పర్సంటైల్‌ల ఎలైట్ లిస్ట్‌లోకి తమ ప్రవేశానికి కారణమని వారు పేర్కొన్నారు. “ఆకాష్ మాకు సహాయం చేసినందుకు మేము కృతజ్ఞులం. ఆకాష్ నుండి కంటెంట్ మరియు కోచింగ్ కారణంగా మేము తక్కువ వ్యవధిలో వివిధ సబ్జెక్టులలో చాలా కాన్సెప్ట్‌లను గ్రహించ గలిగాము” అని వారు చెప్పారు.
 
విద్యార్థులను అభినందించిన శ్రీ అభిషేక్‌ మహేశ్వరి, సీఈఓ, ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) మాట్లాడుతూ, ‘‘అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థును మేము అభినందిస్తున్నాము. ప్రహర్ష్‌ విజయం అతని కష్టం, అంకిత భావాన్ని గురించి పుంఖానుపుంఖాలుగా మాట్లాడుతుంది. వారు సాధించిన విజయం, కష్టం మరియు అంకిత భావంతో పాటుగా అతని తల్లిదండ్రుల మద్దతు మరియు తగిన మార్గనిర్ధేశనం చేసిన ఫ్యాకల్టీ, అలాగే ఇనిస్టిట్యూట్‌ అందించిన మద్దతు గురించి వెల్లడిస్తుంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలను వారు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.
 
ఇటీవల విడుదల చేసిన ఫలితాలను గురించి ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీ ధీరజ్‌ మిశ్రా మాట్లాడుతూ, ‘‘అసాధారణ విజయం సాధించిన మా విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతున్నాము. అత్యుత్తమ స్కోర్‌ సాధించిన విద్యార్థుల ప్రతిభ, అంకిత భావం ఈ ఫలితాల్లో కనిపిస్తుంది. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ఆకాష్‌ బైజూస్‌ ఫ్యాకల్టీకి మేము అభినందనలు తెలుపుతున్నాము. వారు అవిశ్రాంతంగా విద్యార్థులకు మద్దతు అందించడంతో పాటుగా వారి అనుమానాలు, సందేహాలు తీరుస్తున్నారు. ఆకాష్‌ బైజూస్‌ అందించే కరిక్యులమ్‌తో పాటుగా మా విద్యార్థుల నిబద్ధత ఈ విజయానికి కీలకంగా మారింది’’ అని అన్నారు.
 
అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ (ఎంబీబీఎస్‌), డెంటల్‌ (బీడీఎస్‌) మరియు ఆయుష్‌ (బీఏఎంఎస్‌, బీయుఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ మొదలైనవి) కోర్సులలో భారతదేశ  వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇనిస్టిట్యూట్‌లలో ప్రవేశం కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రతి సంవత్సరం నీట్‌‌ను అర్హత పరీక్షగా నిర్వహిస్తుంది. నీట్‌ 2023 కోసం దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోకల్ ట్రైనులో 20 యేళ్ళ యువతిపై అత్యాచారం.. ఎక్కడ?