Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనంత్ నేషనల్ యూనివర్శిటీ 6వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీమతి సుధా మూర్తి

Sudha Murti

ఐవీఆర్

, మంగళవారం, 3 డిశెంబరు 2024 (22:50 IST)
అనంత్ నేషనల్ యూనివర్శిటీ 6వ స్నాతకోత్సవాన్ని నిర్వహించింది, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ డిజైన్, అనంత్ ఫెలోషిప్ ఇన్ సస్టైనబిలిటీ అండ్ బిల్ట్ ఎన్విరాన్‌మెంట్ నుండి 293 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసింది. పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, పార్లమెంటు( రాజ్యసభ) సభ్యులు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మూర్తి ట్రస్ట్ చైర్‌పర్సన్, రచయిత్రి, పరోపకారి శ్రీమతి సుధా మూర్తి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంత్ నేషనల్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ శ్రీ అజయ్ పిరమల్, అనంత్ నేషనల్ యూనివర్శిటీ  ప్రొవోస్ట్ డాక్టర్ అనునయ చౌబే, అనంత్ నేషనల్ యూనివర్శిటీ వ్యవస్థాపక ప్రొవోస్ట్ డాక్టర్ ప్రమత్ రాజ్ సిన్హా, బోర్డు సభ్యులు స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. పిరమల్ గ్రూప్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ స్వాతి పిరమల్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
 
తన స్నాతకోత్సవ ప్రసంగంలో అనంత్ గ్రాడ్యుయేట్ లను ఉద్దేశించి, శ్రీమతి మూర్తి మాట్లాడుతూ, “మీరందరూ బ్రహ్మ దేవుడు వంటి సృజనాత్మక వ్యక్తులు-సృష్టికర్తలు. డిజైన్ ద్వారా, మీరు మీ భావోద్వేగాలు, ఆలోచనలను వ్యక్తపరుస్తారు. మీ ప్రాజెక్ట్‌ల ద్వారా మీరు కమ్యూనిటీలతో ఎలా కనెక్ట్ అవుతారు అనేది నిజంగా ప్రత్యేకం. నా అనుభవంలో, ఈ రోజు చాలా మంది యువకులు అర్ధవంతమైన కనెక్షన్‌లను నిర్మించుకోవడానికి కష్టపడుతున్నారు, కానీ అనంత్ విషయంలో అలా కాదు. ఈ ప్రత్యేకమైన నాణ్యత మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది" అని అన్నారు.
 
అనంత్ నేషనల్ యూనివర్శిటీ యొక్క కొన్ని ఆవిష్కరణలు తనను ఆకట్టుకున్నాయని, ముఖ్యంగా ADEPT, అనంత్ డిజైన్ ఎంట్రన్స్, ప్రొఫిషియన్సీ టెస్ట్- మన దేశంలో భాషా అవరోధాన్ని అధిగమించి సృజనాత్మక యువతకు చేరువయ్యే ఏకైక బహుభాషా డిజైన్ పరీక్ష అని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా అనంత్ నేషనల్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ అజయ్ పిరమల్ మాట్లాడుతూ, “ఆధునిక సాంకేతికతను సాంప్రదాయ పద్ధతులతో మిళితం చేసే ప్రపంచ స్థాయి విద్యను అందిస్తూ  డిజైన్ విప్లవానికి నాయకత్వం వహిస్తున్నామన్నారు. 
 
అనంత్ నేషనల్ యూనివర్శిటీ ప్రోవోస్ట్ డాక్టర్ అనునయ చౌబే మాట్లాడుతూ సాంప్రదాయ తరగతి గదులకు మాత్రమే పరిమితం కాకుండా నిజ-సమయంలో కమ్యూనిటీలతో పనిచేసే నిజ జీవిత అనుభవాల ద్వారా మా విద్యార్థులు ప్రపంచంపై క్లిష్టమైన అవగాహనతో సృజనాత్మకతను పెంపొందించుకోవాలని మేము కోరుకుంటున్నామన్నారు. అకడమిక్ ఎక్సలెన్స్, అత్యుత్తమ అకాడెమిక్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ ఇన్నోవేషన్, బెస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్, బెస్ట్ థీసిస్, బెస్ట్ లైవ్-యాక్షన్ ప్రాజెక్ట్ మరియు బెస్ట్ స్టూడెంట్‌లతో సహా అన్ని ప్రోగ్రామ్‌లలో విస్తరించి ఉన్న 10 కేటగిరీలలో 32 మంది అసాధారణ విద్యార్థులను ఈ వేడుక గుర్తించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపాధ్యాయుడికి చెప్పు దెబ్బలతో దేహశుద్ధి... (Video)